Samsung Galaxy M47 5G : 6000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో శాంసంగ్ కొత్త 5G ఫోన్.. కీలక స్పెసిఫికేషన్లు లీక్!

Samsung Galaxy M47 5G : శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 29న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. అంతకన్నా ముందే ఈ ఫోన్ కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.. పూర్తి వివరాలివే..

Samsung Galaxy M47 5G Launch

  • ఈ నెల 29న శాంసంగ్ గెలాక్సీ M47 5G ఫోన్ లాంచ్
  • 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే ఆప్షన్
  • ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా సెటప్
  • రోగ్ రెడ్ బ్లేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది

Samsung Galaxy M47 5G : శాంసంగ్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్.. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M47 5G లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ శాంసంగ్ ఫోన్ జూన్ 29న రానుంది. కంపెనీ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఒకటి.

ఆకర్షణీయమైన ఫీచర్లతో రానున్న ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల (Samsung Galaxy M47 5G) అమోల్డ్ డిస్‌ప్లే ఉండనుంది. భారీ 6000mAh బ్యాటరీతో పాటు కంపెనీ రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో అందించనుంది. శాంసంగ్ గెలాక్సీ M47 5జీ లాంచ్ సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ M47 5జీ లాంచ్ తేదీ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ లాంచ్ తేదీ ఖరారైంది. ఈ శాంసంగ్ ఫోన్ జూన్ 29న మార్కెట్లోకి రానుంది. ఈ బ్రాండ్ ఫోన్ దాదాపు అన్ని కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది.

రంగు వేరియంట్లు, లభ్యత :
కంపెనీ శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో తీసుకువస్తోంది. ఈ ఫోన్ రోగ్ రెడ్ బ్లేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ ఫోన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర సుమారు రూ. 30వేలు ఉండవచ్చని అంచనా.

డిస్‌ప్లే :
శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. కంపెనీ డిస్‌ప్లేపై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ అందిస్తుంది. అంతేకాదు.. 4 రెట్లు స్క్రాచ్ రెసిస్టెన్స్ ఫీచర్ అందిస్తుంది.

ఈ శాంసంగ్ ఫోన్ 2 మీటర్ల ఫాల్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది. కంపెనీ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ప్రొటెక్షన్ అందించింది. కంపెనీ ఈ ఫోన్‌తో 6 ఏళ్ల పాటు OS అప్‌డేట్‌ అందిస్తుంది. 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు కూడా పొందవచ్చు.

Read Also : HMD Asha 305 Leak : నోకియా లవర్స్‌కు పండగే.. 14 ఏళ్ల తర్వాత ఆశా 305 ఫోన్ రీఎంట్రీ.. HMD కొత్త స్టైల్‌ అదిరిందిగా..!

ప్రాసెసర్ :
గెలాక్సీ M47 5జీ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 SoCతో రన్ అవుతుందని ధృవీకరించింది. కంపెనీ LPDDR5X ర్యామ్ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో పాటు వన్ యూఐ 8.5తో వస్తుంది.

రియర్ కెమెరా :
శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా ఉంది. 5MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. థర్డ్ కెమెరా 2MP మాక్రో షూటర్ అందిస్తుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ HDRకు సపోర్ట్ చేస్తుంది.

సెల్ఫీ కెమెరా :
శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ ఫ్రంట్ సైడ్ పంచ్-హోల్‌లో 12MP సెల్ఫీ కెమెరా అందిస్తుంది.

బ్యాటరీ ఛార్జింగ్ :
ఈ శాంసంగ్ 5జీలో భారీ బ్యాటరీ ఉంటుందని అంచనా. కంపెనీ బ్యాటరీ ఎంత అనేది అధికారికంగా వెల్లడించలేదు. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్‌లో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది.