Samsung Galaxy M55 5G : శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్!

Samsung Galaxy M55 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక కీలక స్పెసిఫికేషన్‌లు గతంలోనూ వెలువడ్డాయి. కొత్త నివేదిక ప్రకారం.. ఈ 5జీ ఫోన్ మరిన్ని వివరాలను లీక్ చేసింది. గత లీక్‌లలో ఫొటోలను బ్యాకప్ చేసే డిజైన్ రెండర్‌లను కూడా షేర్ చేసింది.

Samsung Galaxy M55 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఇందులో కొన్ని లీక్ అయిన లైవ్ ఇమేజ్‌లు మోడల్ డిజైన్‌ను సూచిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక కీలక స్పెసిఫికేషన్‌లు కూడా గతంలో వెలువడ్డాయి. కొత్త నివేదిక ప్రకారం.. ఈ 5జీ ఫోన్ మరిన్ని వివరాలను లీక్ చేసింది. గత లీక్‌లలో ఫొటోలను బ్యాకప్ చేసే డిజైన్ రెండర్‌లను కూడా షేర్ చేసింది.

Read Also : Apple CEO Tim Cook : హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఐఫోన్‌తో తీసిన ఫొటో షేరింగ్..!

ఎమ్ఎస్ పవర్ యూజర్ నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 5జీ డిజైన్ రెండర్‌లను షేర్ చేసింది. ఈ ఫోన్ డిస్‌ప్లే స్లిమ్ బెజెల్స్‌తో ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. సెంటర్డ్ హోల్-పంచ్ స్లాట్‌తో కనిపిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, లైట్ గ్రీన్ అనే మొత్తం 2 కలర్ ఆప్షన్లలో కనిపిస్తుంది. 180 గ్రాముల బరువు ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 5జీ బ్యాక్ ప్యానెల్ 3 వేర్వేరు వృత్తాకార స్లాట్‌లలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటు టాప్ లెఫ్ట్ కార్నర్‌లో నిలువుగా అమర్చి ఉంటుంది. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ రైట్ ఎడ్జ్‌‌న కనిపిస్తాయి.

శాంసంగ్ గెలాక్సీ M55 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 5జీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుందని అంచనా. గరిష్టంగా 12జీబీ ర్యామ్, మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు స్టోరేజ్ ఎక్స్‌టెన్షన్‌కు సపోర్టు అందిస్తుంది. 128జీబీ, 256జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐతో వచ్చే అవకాశం ఉంది. 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు 5 జనరేషన్ ఓఎస్ అప్‌డేట్‌లను పొందే అవకాశం ఉంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8ఎంపీ సెన్సార్, 2ఎంపీ మాక్రో సెన్సార్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 50ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. నైటోగ్రఫీ, డ్యూయల్ రికార్డింగ్, ఓఐఎస్, వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (VDIS) సపోర్ట్‌తో స్టెబిలైజ్డ్ 4కె వీడియో రికార్డింగ్‌ల వంటి కెమెరా ఫీచర్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 5జీ ఫోన్ 45డబ్ల్యూ వైర్డ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ శాంసంగ్ నాక్స్ వాల్ట్‌తో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించగలదు. బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీతో పాటుగా డ్యుయల్ సిమ్-సపోర్టు ఉన్న హ్యాండ్‌సెట్ డాల్బీ అట్మోస్ ఆడియోకు కూడా సపోర్టుఇస్తుందని భావిస్తున్నారు.

Read Also : Samsung Galaxy Watch 7 : కొత్త వాచ్ కోసం చూస్తున్నారా? 3 విభిన్న వేరియంట్లలో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ వచ్చేస్తోంది!

ట్రెండింగ్ వార్తలు