Apple CEO Tim Cook : హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఐఫోన్‌తో తీసిన ఫొటో షేరింగ్..!

Apple CEO Tim Cook : ఈ అందమైన ఫొటో పండుగతో ఆనందం, రంగుల స్ఫూర్తిని సూచిస్తుంది. ఫోటోగ్రాఫర్ జాషువా కార్తీక్ ఈ ఫొటోను ఐఫోన్‌తో తీశారు. హోలీ జరుపుకునే వారందరికీ హోలీ శుభాకాంక్షలు.

Apple CEO Tim Cook : హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఐఫోన్‌తో తీసిన ఫొటో షేరింగ్..!

Apple CEO Tim Cook wishes Happy Holi with this picture shot on iPhone

Apple CEO Tim Cook : సాంప్రదాయమైన హోలీ పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులందరికి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ట్విట్టర్‌ (X) వేదికగా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఐఫోన్‌లో తీసిన ఒక అందమైన రంగులతో కూడిన ఫొటోను ఆయన షేర్ చేశారు. ‘ఐఫోన్‌తో క్రియేటివిటీ ఆపిల్ దృష్టిని ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక వేడుకలు, యూజర్ల కంటెంట్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

Read Also : Xiaomi SU7 Price : షావోమీ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు రెండు వెర్షన్లలో వచ్చేస్తోంది.. ధర ఎంతో రివీల్ చేసిన కంపెనీ సీఈఓ

#ShotOniPhone క్యాంపెయిన్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది’ అంటూ కుక్ ట్వీట్ చేశారు. ఈ అందమైన ఫొటో పండుగతో ఆనందం, రంగుల స్ఫూర్తిని సూచిస్తుంది. ఫోటోగ్రాఫర్ జాషువా కార్తీక్ ఈ ఫొటోను తీశారు. హోలీ జరుపుకునే వారందరికీ హోలీ శుభాకాంక్షలు. రంగుల పండుగను సూచించేలా #ShotOniPhone ఫోటోను షేర్ చేసినందుకు @joshuakarthikr ధన్యవాదాలు’ అని కుక్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

జాషువా కార్తీక్ ఫోటోగ్రఫీకి పెట్టింది పేరు. ఐఫోన్‌తో ఫొటోలను అందంగా తీయడంలో ఆయనకు ఆయనే సాటి. వాస్తవానికి, కుక్ 2023లో భారత్‌కు వచ్చినప్పుడు.. ఫొటోలను తీయడానికి ఐఫోన్‌ను ఎలా ఉపయోగిస్తాడో అర్థం చేసుకోవడానికి కుక్ కార్తీక్‌ని కూడా కలిశాడు.

దీపావళి రోజున కూడా ఫొటో షేర్ చేసిన కుక్ :
ఆపిల్ సీఈఓకు ఇదొక సంప్రదాయంగా మారింది. గత ఏడాదిలో హోలీ పండుగ సందర్భంగా కూడా భారతీయ ఫోటోగ్రాఫర్లు గుర్సిమ్రాన్ బస్రా, అపేక్ష మేకర్ తీసిన ఫొటోలను టిమ్ కుక్ షేర్ చేశారు. గత ఏడాది దీపావళి రోజున కూడా కుక్ ఒక భారతీయ ఫోటోగ్రాఫర్ ఐఫోన్‌లో తీసిన ఫొటోలను షేర్ చేశారు.

ఆపిల్ భారతీయ కస్టమర్లతో మరింత కనెక్ట్ అయ్యేందుకు కుక్ హోలీ శుభాకాంక్షలు చెప్పారని భావించవచ్చు. ఐఫోన్ ఫొటోగ్రఫీతో ప్రత్యేక క్షణాలు, సాంస్కృతికపరమైన విషయాలను అద్భుతంగా క్యాప్చర్ చేయగల ఐఫోన్ సామర్థ్యాన్ని కుక్ స్పష్టం చేశారు. ఐఫోన్ ద్వారా మరింత క్రియేటివిటీని అందించగలదనే విషయాన్ని #ShotOniPhone హ్యాష్‌ట్యాగ్ ద్వారా హైలైట్ చేశారు టిమ్ కుక్.

Read Also : Apple CEO Tim Cook : భారత్‌లో రికార్డు స్థాయిలో ఐఫోన్ విక్రయాలు.. ఫస్ట్ టైమ్ శాంసంగ్‌‌ను అధిగమించిన ఆపిల్