Samsung Galaxy S23 up for Pre-Orders in India at just Rs 1,999_ Here are the details
Samsung Galaxy S23 Pre-Orders : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ గెలాక్సీ S23 (Samsung S23 Series)ని ఫిబ్రవరి 1న శాన్ ఫ్రాన్సిస్కోలో (రాత్రి 11:30 PM IST) కి ప్రకటించనుంది. శాంసంగ్ సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి అనేక వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాబోయే శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల వినియోగదారులు గెలాక్సీ S23 సిరీస్‌ను కేవలం రూ. 1,999తో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
Samsung Galaxy S23 up for Pre-Orders in India at just Rs 1,999
శాంసంగ్ Galaxy S23 సిరీస్‌ను Samsung.com, Samsung ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, అమెజాన్ (Amazon Sale) ద్వారా ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ప్రముఖ రిటైలర్లు కేవలం రూ. 1,999లకే Galaxy S23ని కొనుగోలు చేసిన వారికి రూ. 5,000 విలువైన బెనిఫిట్స్ అందిస్తుంది. S23 Plus, లేదా S23 Ultra డివైజ్‌లు మార్చి 31, 2023లోపు అందిస్తుంది. క్యాష్ బెనిఫిట్స్‌తో పాటు, డివైజ్ ప్రీ-ఆర్డర్ చేసిన వారు కూడా డివైజ్‌కు ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు.
ఈ కొత్త గెలాక్సీ S23 సిరీస్ లాంచ్ అయిన వెంటనే ప్రొడక్టు లభ్యతను నిర్ధారిస్తుంది. Samsung ప్రకారం.. Galaxy S23 సిరీస్ కొత్త ఫ్లాగ్‌షిప్‌తో రానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు లేదా ఫీచర్‌లు తెలియకుండా ప్రీ-ఆర్డర్ చేయాలంటే ఆలోచించాల్సిన విషయమే.. గెలాక్సీ S23 సిరీస్ కచ్చితంగా ఈ ఏడాదిలో అత్యుత్తమ Android ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కానుంది. డిజైన్ పరంగా, Galaxy S23 సిరీస్ గెలాక్సీ S22 సిరీస్‌కు సమానంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం ప్రాసెసర్, కెమెరాలు అని చెప్పవచ్చు.
Samsung Galaxy S23 up for Pre-Orders in India at just Rs 1,999
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫీచర్లు ( అంచనా) :
శాంసంగ్ Galaxy S23 సిరీస్‌లో Galaxy S23, Galaxy S23 Plus, Galaxy S23 Ultra అనే మూడు మోడల్స్ ఉంటాయి. ఈ మూడు మోడల్‌లు స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. కనీసం 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తాయి. మూడు మోడల్‌లు మెటల్ ఫ్రేమ్‌తో గ్లాస్ శాండ్‌విచ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.
వాటర్, డెస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం IP రేటింగ్ వంటి ఫీచర్లను కూడా అందిస్తాయి. లాంచ్ టీజర్‌ల ప్రకారం.. Galaxy S23 సిరీస్ హైలైట్ తక్కువ-కాంతిలోనూ కెమెరా పర్ఫార్మెన్స్, Samsung Google, Apple నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా మెరుగైన ఆస్ట్రో ఫోటోగ్రఫీని కూడా అందిస్తుందని చెప్పవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..