Samsung Galaxy S24 FE
Samsung Galaxy S24 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ బ్రాండ్-న్యూ గెలాక్సీ S25 FE ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ లాంచ్ అయిన వెంటనే కంపెనీ పాత జనరేషన్ గెలాక్సీ S24 FE అమెజాన్‌లో భారీ ధర తగ్గింపు పొందింది.
ఈ తగ్గింపు బ్యాంకు ఆఫర్లతో పనిలేకుండా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్ ఆఫర్. మీ బడ్జెట్ రూ. 35వేలు అయితే ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా వర్క్ అవుతుంది? ఇంకా డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర :
అమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ ఇప్పుడు రూ.34,499కి తగ్గింపు ధరకే లభిస్తోంది. అసలు లాంచ్ ధర కన్నా రూ.25,500 తగ్గింది. దానితో పాటు, మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.1,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ప్రస్తుత ధర రూ.33,499కి తగ్గుతుంది.
ఈ డీల్‌ను మరింత తగ్గింపు ధరకే పొందడానికి కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను రూ.31వేల వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది ట్రేడ్ డివైజ్, మోడల్, వర్కింగ్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. హుడ్ కింద, 8GB ర్యామ్, ఎక్సినోస్ 2400e చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 14లో వన్ యూఐ 6.1తో రన్ అవుతుంది.
7 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్ డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లతో వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా ఫ్రంట్ సైడ్ శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 8MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ జనరేటివ్ ఎడిట్, పోర్ట్రెయిట్ స్టూడియో, ఎడిట్ సజెషన్స్, ఇన్‌స్టంట్ స్లో-మో వంటి అనేక గెలాక్సీ ఏఐ ఫీచర్లను అమర్చింది. ఫొటో, వీడియో ఎడిటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. గూగుల్ తో సర్కిల్ టు సెర్చ్, ఇంటర్‌ప్రెటర్, లైవ్ ట్రాన్స్‌లేట్, నోట్ అసిస్ట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.