×
Ad

Samsung Galaxy S24 5G : అమెజాన్‌లో శాంసంగ్ 5G ఫోన్ దుమ్మురేపుతోంది.. ఈ ధర చూసిన వెంటనే ‘BUY NOW’ నొక్కేస్తారు..!

Samsung Galaxy S24 Price : అమెజాన్ ఆఫర్ అదిరింది.. శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ ఒకేసారి రూ. 30వేలకు పైగా ధర తగ్గింపు పొందింది. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే..

1/6
Samsung Galaxy S24 Price : కొత్త ప్రీమియం ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీ బడ్జెట్ ధరలోనే కొత్త శాంసంగ్ ప్రీమియం ఫోన్ కొనేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ ప్రారంభంలో రూ. 74,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ స్పీడ్ పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన డిస్‌‌ప్లే, కెమెరా సెటప్ కలిగి ఉంది.
2/6
తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోరుకునే కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆప్షన్. క్యాష్‌బ్యాక్, ఈఎంఐ ప్లాన్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌ల వంటి అదనపు ఆఫర్లతో ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. రూ. 45వేల మార్క్ కన్నా తక్కువ ధరలో కొనుగోలుదారులకు శాంసంగ్ గెలాక్సీ S24 5G అద్భుతమైన ఆప్షన్. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
3/6
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ధర ఎంతంటే? : శాంసంగ్ గెలాక్సీ S24 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. శాంసంగ్ బ్లాక్ వేరియంట్ ధర రూ.41,825 లాంచ్ ధర కన్నా దాదాపు రూ.33,174 తక్కువగా అందుబాటులో ఉంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలుదారులు రూ.1,254 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ధర దాదాపు రూ.40,571కి తగ్గుతుంది. నెలకు రూ.2,028 నుంచి ఈఎంఐ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
4/6
ఇంకా, ఈ ఇ-కామర్స్ బ్రాండ్ యూజర్లకు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. బ్రాండ్, కండిషన్, మోడల్ ఆధారంగా రూ. 37,200 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఆసక్తిగల యూజర్లలో ఎక్స్‌టెండెడ్ వారంటీ లేదా ప్రొటెక్షన్ ప్లాన్లు వంటి అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
5/6
శాంసంగ్ గెలాక్సీ S24 5జీ స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. లోపల వైపు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌పై రన్ అవుతుంది. 8GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా శాంసంగ్ వన్ యూఐ 8పై రన్ అవుతుంది. 4,000mAh బ్యాటరీ 25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
6/6
కనెక్టివిటీ విషయానికి వస్తే.. Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB టైప్-C పోర్ట్‌ అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్ IP68 రేటింగ్‌ కలిగి ఉంది. అంతేకాకుండా, శాంసంగ్ ఫోన్ బ్యాక్ కెమెరా సిస్టమ్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ 8K వీడియో సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, కాల్స్ కోసం 12MP కెమెరా కూడా ఉంది.