Samsung Galaxy S24 Price : శాంసంగ్ గెలాక్సీ ఫోన్ S24 ధర తగ్గిందోచ్.. అమెజాన్‌‌లో ఇంకా తక్కువకే కొనేసుకోవచ్చు..!

Samsung Galaxy S24 Price : ప్రస్తుతం పండుగ ఆఫర్‌లో భాగంగా భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ రూ. 59,999కు అందిస్తోంది. ఈ ధర రూ. 12వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, రూ. 3వేల అప్‌గ్రేడ్ బోనస్ కూడా అందిస్తోంది.

Amazon Offers Lower Price Ahead of Sale

Samsung Galaxy S24 Price : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ తమ కంపెనీ వెబ్‌సైట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధరపై భారీ తగ్గింపు అందిస్తుంది. ఈ మేరకు శాంసంగ్ ఒక ప్రకటనలో తెలిపింది. శాంసంగ్ కంపెనీ ప్రకారం.. పరిమిత కాలపు పండుగ ఆఫర్‌ అందిస్తోంది.

Read Also : OnePlus Diwali Sale : వన్‌ప్లస్ దీపావళి సేల్.. ఈ వన్‌ప్లస్ మోడల్స్‌పై బిగ్ డిస్కౌంట్లు.. ఈ డీల్స్ అసలు మిస్ కావొద్దు..!

కస్టమర్లు కంపెనీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్‌ను రూ. 60వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. కంపెనీ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, అమెజాన్‌లో ఈ గెలాక్సీ ఫోన్ మరింత తక్కువ ధరకు పొందవచ్చు. కొనుగోలుదారులు ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయాలంటే అమెజాన్ సేల్ కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

భారత్‌లో శాంసంగ్ vs అమెజాన్ ధర ఎంతంటే? :
ప్రస్తుతం పండుగ ఆఫర్‌లో భాగంగా భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ రూ. 59,999కు అందిస్తోంది. ఈ ధర రూ. 12వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, రూ. 3వేల అప్‌గ్రేడ్ బోనస్ (లేదా బ్యాంక్ క్యాష్‌బ్యాక్) కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ తగ్గింపును కూడా అందిస్తోంది. ఇతర స్మార్ట్‌ఫోన్లపై ట్రేడింగ్ చేస్తే రూ. 40వేలకు కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 గత జనవరిలో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ ధర రూ. 74,999కు అందిస్తోంది. మీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్24ని కొనుగోలు చేయగల అతి తక్కువ ధర ఇది కాదని గమనించాలి.

అమెజాన్‌లో ఇదే హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రూ. 57,490కు అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్‌లు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. తద్వారా హ్యాండ్‌సెట్ ధరను రూ. 24,250 వరకు తగ్గించుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ ఈ నెల (సెప్టెంబర్) 27 నుంచి ప్రారంభమవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 కొనుగోలు చేసే ముందు మరో వారం వేచి ఉండటం మంచిది. ఈ హ్యాండ్‌సెట్ ధర గతంలో రూ. 56వేలకు కింద పడిపోయింది. అమెజాన్ ఈ ఏడాదిలో అతిపెద్ద సేల్ హ్యాండ్‌సెట్‌పై అదనపు డిస్కౌంట్లను అందించే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆండ్రాయిడ్ 14 పై వన్ యూఐ 6.1.1తో రన్ అవుతుంది. 1Hz-120Hz మధ్య రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ స్క్రీన్‌ను కలిగి ఉంది. భారత మార్కెట్లో గెలాక్సీ ఎస్24 ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో పాటు 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్‌తో పనిచేస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10ఎంపీ టెలిఫోటో కెమెరాతో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ 12ఎంపీ సెల్ఫీ కెమెరాతో హోల్ పంచ్ కటౌట్‌ కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. గెలాక్సీ ఎస్24 ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్ సపోర్ట్‌తో పాటు 25డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీని అందిస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. 147×70.6×7.6ఎమ్ఎమ్ కొలతలు, 167గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : iPhone 16 Discount : కొత్త ఐఫోన్ 16 కొంటున్నారా? ఇలా చేస్తే.. రూ. 55వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!