×
Ad

Samsung Galaxy S25 5G : అమెజాన్ ఆఫర్ అదిరింది భయ్యా.. రూ.83వేల శాంసంగ్ 5జీ ఫోన్ జస్ట్ రూ. 41వేలకే, ఎలాగంటే?

Samsung Galaxy S25 5G : శాంసంగ్ గెలాక్సీ S25 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ సేల్ సమయంలో ఈ శాంసంగ్ ఫోన్ ఏకంగా రూ. 16,500 తగ్గింపు పొందింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/7
Samsung Galaxy S25 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ ధర అమెజాన్‌లో భారీగా తగ్గిందోచ్.. వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అంతకన్నా ముందే శాంసంగ్ ప్రస్తుత జనరేషన్ మోడల్ శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 67వేల కన్నా తక్కువ ధరకే లభ్యమవుతోంది.
2/7
శాంసంగ్ 5జీ ఫోన్ మొత్తం 4 స్టైలిష్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. క్వాల్‌కామ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌ కూడా ఉంది. ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది.
3/7
ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్, కార్డ్ ఆఫర్‌లతో ఈ శాంసంగ్ 5జీ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/7
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 5G ధర ఎంతంటే? : శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ అసలు లాంచ్ ధర రూ.82,999 నుంచి ఏకంగా రూ.66,300కి తగ్గింది. అదనంగా, కొన్ని క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేస్తే కొనుగోలుదారులు రూ.1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ.64,800కి తగ్గుతుంది. అంతేకాదు.. అమెజాన్‌లో ఈఎంఐ రూ.2,331 ఆప్షన్లు కూడా ఉన్నాయి.
5/7
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే అదనంగా రూ. 42,000 సేవ్ చేసుకోవచ్చు. దాంతో ఈ కొత్త శాంసంగ్ ఫోన్ రూ. 40,999కు సొంతం చేసుకోవచ్చు. అయితే, మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ బ్రాండ్ బట్టి ఉంటుంది. లేదంటే అదనంగా డబ్బులు చెల్లించి ఎక్స్ ట్రా యాడ్-ఆన్‌లు, ఎక్స్ టెండెడ్ వారంటీని తీసుకోవచ్చు. తద్వారా మీ ఫోన్ రీసేల్ వాల్యూ పెరుగుతుంది.
6/7
శాంసంగ్ గెలాక్సీ S25 5జీ స్పెషిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S25 5G ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. హుడ్ కింద క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ నుంచి పవర్ పొందుతుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.
7/7
బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 4,000mAh బ్యాటరీ, 25W వైర్డ్ ఛార్జర్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత స్కిన్ వన్ యూఐ 8పై రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP మెయిన్, 12MP అల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరాతో వస్తుంది.