×
Ad

Samsung Galaxy S25 5G : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం కిర్రాక్ ఆఫర్.. ఈ గెలాక్సీ S25 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే..

Samsung Galaxy S25 5G : శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ శాంసంగ్ ఫోన్ ఏకంగా రూ. 14,029 ధరకు లభిస్తోంది. ఈ అద్భుతమైన క్రేజీ డీల్ ఎలాపొందాలంటే?

Samsung Galaxy S25 5G (Image Credit To Original Source)

  • అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 5జీపై భారీ తగ్గింపు
  • గెలాక్సీ S26 లాంచ్‌కు ముందే తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S25
  • బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ పొందవచ్చు

Samsung Galaxy S25 5G : శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌ లాంచ్ కానుంది. అంతకన్నా ముందే శాంసంగ్ గెలాక్సీ S25 అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ ప్రస్తుతం రూ. 14,029 తగ్గింపుతో లభ్యమవుతుంది.

రూ. 67వేల కన్నా తక్కువ ధరకు అమోల్డ్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, ట్రిపుల్ కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ S25 వంటి ఫోన్ అద్భుతమైన డీల్ ఆఫర్ చేస్తోంది. మీరు కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. ఇంతకీ ఈ శాంసంగ్ ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ధర ఎంతంటే? :
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ రూ.68,470కి లిస్టింగ్ అయింది. లాంచ్ ధర రూ.80,990 నుంచి తగ్గింపు పొందింది. అదనంగా, కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనంగా రూ. 1,500 తగ్గింపు పొందవచ్చు. దాంతో ధర రూ.67వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. కస్టమర్లు ఈ శాంసంగ్ ఫోన్ నెలకు రూ.2,407 నుంచి ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు.

Read Also : Union Budget 2026 : ఆశలు ఆవిరి.. ఇక పాత పన్ను శరణ్యమా? సీనియర్ సిటిజన్లకు ఈసారి బడ్జెట్ ఇదే..!

ఈ డీల్ ద్వారా కస్టమర్లు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్, బ్రాండ్, వేరియంట్ ఆధారంగా రూ. 35,950 వరకు ఎక్స్చేంజ్ వాల్యూ పొందవచ్చు. అదనంగా, కస్టమర్లు ఎక్కువ చెల్లిస్తే ఎక్స్ టెండెడ్ వారంటీ, ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్ వంటి కొత్త యాడ్-ఆన్ ఆఫర్లను కూడా పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 5జీ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2Xతో 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, ఈ ఫోన్ గెలాక్సీ కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో వస్తుంది. 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది.

ఈ శాంసంగ్ ఫోన్ 4000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP వెడల్పు, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 12MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.