Samsung Galaxy S25 Edge
Samsung Galaxy S25 Edge Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మరికొద్ది రోజులు ఆగండి.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త S25 ఎడ్జ్ ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2025లో లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల (MWC 2025)లో ప్రదర్శించింది. శాంసంగ్ అభిమానులు గెలాక్సీ S25 ఎడ్జ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ శాంసంగ్ ఫోన్ డిస్‌ప్లే, సైజు, బరువు అంచనా ధరకు సంబంధించి కీలక వివరాలు లీక్ అయ్యాయి.
Read Also : Google Warning : గూగుల్ వార్నింగ్.. ఆండ్రాయిడ్ యూజర్లు వెంటనే ఈ పని చేయండి.. లేకపోతే..
రాబోయే ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, సన్నని డిజైన్, శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ కన్నా తేలికైన బిల్డ్ ఉంటాయి. అయితే, ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌కు బదులుగా చిన్న బ్యాటరీ, డ్యూయల్-కెమెరా సెటప్‌తో రావచ్చు. శాంసంగ్ సన్నని ఫ్లాగ్‌షిప్ గురించి మరిన్ని అప్‌డేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శాంసంగ్ ఎస్25 ఎడ్జ్ ధర (అంచనా) :
టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ ధర జనవరి 2025లో లాంచ్ అయిన గెలాక్సీ ఎస్25 ప్లస్ ధరకే ఉంటుంది. లీక్ కచ్చితమైనది అయితే.. శాంసంగ్ ఫోన్ ధర 999 డాలర్లు (భారత మార్కెట్లో సుమారు రూ. 87,150) ఉంటుందని భావించవచ్చు. శాంసంగ్ ఇంకా అధికారికంగా ధరను ధృవీకరించలేదు. కానీ, ఈ లీక్ కొనసాగితే గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ స్టాండర్డ్, గెలాక్సీ S25, ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S25 అల్ట్రా మధ్య ప్రీమియం ఆప్షన్లు కలిగి ఉండవచ్చు.
స్లిమ్ బెజెల్స్‌తో 6.65-అంగుళాల డిస్‌ప్లే :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ 6.65-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. గెలాక్సీ ఎస్25 ప్లస్‌లోని 6.7-అంగుళాల ప్యానెల్ కన్నా కొంచెం చిన్నదిగా ఉంటుంది. అయితే, గెలాక్సీ S25 అల్ట్రా మాదిరిగానే స్లిమ్ బెజెల్‌లను కలిగి ఉండవచ్చు. మరింత వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందించవచ్చు. ఫోన్ డిస్‌ప్లే రివీల్ చేయనప్పటికీ, పవర్‌ఫుల్ కలర్లు, స్ఫుటమైన విజువల్స్ కోసం క్యూహెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో హై రిఫ్రెష్ రేట్ అమోల్డ్ ప్యానెల్‌ను చూడవచ్చు.
అల్ట్రా-స్లిమ్ డిజైన్ ఆప్షన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ 5.84ఎమ్ఎమ్ మందం కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ కన్నా 1.46ఎమ్ఎమ్ సన్నగా ఉంటుందని పుకారు ఉంది. ఇప్పటివరకు వచ్చిన అత్యంత సన్నని గెలాక్స్ ఎస్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా మారవచ్చు. అదనంగా, ఈ శాంసంగ్ ఫోన్ బరువు కేవలం 162 గ్రాములు. గెలాక్సీ S25 ప్లస్ (195 గ్రాములు) కన్నా చాలా తేలికగా ఉంటుంది. అయితే, ప్లస్ వేరియంట్‌తో పోలిస్తే.. చిన్న బ్యాటరీ కారణంగా ఫోన్ బరువు తక్కువగా ఉండవచ్చు.
The accurate rendering of the S25 edge is here, the screen size is 6.656 inches, but the bezel is the same as the S25 Ultra, which is narrower than the S25+. pic.twitter.com/XHFwVGWe4P
— ICE UNIVERSE (@UniverseIce) March 7, 2025
ట్రిపుల్ కెమెరాలు కాదు.. డ్యూయల్-కెమెరా సెటప్ :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ మాదిరిగా ట్రిపుల్-కెమెరా సెటప్ ఉండకపోవచ్చు. గెలాక్సీ S25 ఎడ్జ్‌లో రెండు రియర్ కెమెరాలు ఉంటాయని భావిస్తున్నారు. కెమెరా సెన్సార్ల గురించి వివరాలు వెల్లడించలేదు. శాంసంగ్ మెరుగైన ఏఐ ఆధారిత ఫొటోగ్రఫీ ఫీచర్‌లతో కూడిన హై-రిజల్యూషన్ ప్రైమరీ సెన్సార్‌ను ఉపయోగించవచ్చు.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, వన్ UI 7 (అంచనా) :
కొన్ని హార్డ్‌వేర్ సమస్యలు ఉన్నప్పటికీ, గెలాక్సీ S25 ఎడ్జ్, గెలాక్సీ S25+తో కోర్ స్పెసిఫికేషన్‌లతో వచ్చే అవకాశం ఉంది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్
12జీబీ ర్యామ్
ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7
గ్లాస్ కాదు.. సిరామిక్ వెనుక ప్యానెల్? :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్లిమ్ ప్రొఫైల్ కోసం సరికొత్త ప్యానెల్ అందిస్తోంది. కంపెనీ నిర్దిష్ట వివరాలు వెల్లడించలేదు. ఈ ఫోన్ సన్నగా ఉంటుంది. ఇటీవలి నివేదికలు శాంసంగ్ బ్యాక్ ప్యానెల్ గ్లాస్ కాకుండా సిరామిక్ మెటీరియల్‌తో ప్యానల్ అందించనుందని సూచించాయి. డాట్స్, లైన్లు పడకుండా ఈ ప్యానల్ ప్రొటెక్ట్ చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.