Realme P3 Ultra 5G : రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త P3 అల్ట్రా 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కీలక ఫీచర్లు అదుర్స్..!

Realme P3 Ultra 5G : రియల్‌మి P3 అల్ట్రా 5G ఫోన్ భారత్ మార్కెట్లో లాంచ్ కానుంది. టీజర్ ప్రకారం.. ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme P3 Ultra 5G : రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త P3 అల్ట్రా 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కీలక ఫీచర్లు అదుర్స్..!

Realme P3 Ultra 5G set to launch

Updated On : March 8, 2025 / 5:18 PM IST

Realme P3 Ultra 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి అతి త్వరలో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి కొత్త 5జీ ఫోన్ రానుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా కొత్త P3 అల్ట్రా 5G లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Read Also : PAN Card 2.0 : క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలో తెలుసా? ఫుల్ గైడ్ మీకోసం..!

కంపెనీ ప్రమోషనల్ ఇమేజ్‌లో స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను టీజ్ చేసింది. కానీ, ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. ఈ కొత్త ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ అయిన రియల్‌మి P3 ప్రో 5జీ, రియల్‌మి P3x 5జీలలో చేరనుంది. స్టాండర్డ్ రియల్‌మి P3 వేరియంట్ గురించి పుకార్లు వచ్చాయి. కానీ, ఈ ఫోన్ లాంచ్ గురించి ఎలాంటి వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు.

స్పెషల్ పవర్ బటన్‌, డిజైన్ :
రియల్‌మి P3 అల్ట్రా 5జీ రైట్ సైడ్ ప్రొఫైల్‌ను సూచిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ రెండు వేర్వేరు సర్కిల్ మాడ్యూల్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాదు.. వాల్యూమ్ రాకర్స్ కింద అద్భుతమైన ఆరంజ్ కలర్ పవర్ బటన్‌ను కలిగి ఉంది. ఇలాంటి పవర్ బటన్ డిజైన్ గతంలో రియల్‌మి నియో 7ఎక్స్‌లో కనిపించింది. ఈ ఫోన్ గ్రే కలర్ వేరియంట్‌తో ప్రీమియం గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌లో వస్తుందని భావిస్తున్నారు.

ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్ (అంచనా) :
రియల్‌మి P3 అల్ట్రా మోడల్ నంబర్ (RMX5030)తో రియల్‌మి ఫోన్ ఇటీవలి గీక్‌బెంచ్ లిస్టులో కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 లేదా డైమెన్సిటీ 8350 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. మాలి-G615 MC6 GPUతో వస్తుంది.

Read Also : Google Warning : ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక.. మీ ఫోన్లను ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి.. హ్యాకర్లు ఏ క్షణమైనా హ్యాక్ చేయొచ్చు..!

రియల్‌మి P3 అల్ట్రా 5జీ ఫీచర్లు (అంచనా) :
12GB వరకు ర్యామ్ ఆప్షన్
256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ
ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 లేదు

రియల్‌మి P3 అల్ట్రా 5జీ ఫోన్ ‘అల్ట్రా డిజైన్, అల్ట్రా పెర్ఫార్మెన్స్, అల్ట్రా కెమెరా’లను అందిస్తుందని పేర్కొంది. కెమెరా సెన్సార్లు, డిస్‌ప్లే స్పెసిఫికేషన్ల వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ, ఈ ఫోన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్‌పైనే దృష్టిసారిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.