QR Code తో కొత్త పాన్ కార్డు కావాలా..? ఇలా అప్లై చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్..
PAN Card 2.0 : కొత్త పాన్ కార్డు కోసం అప్లయ్ చేసుకున్నారా? ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏయే డాక్యుమెంట్లు కావాలి అనేది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

PAN Card 2 0 Online Application
PAN Card 2.0 : దేశంలో కోట్లాది మంది ట్యాక్స్ పేయర్ల కోసం కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త అప్‌గ్రేడ్ పాన్ క్యూఆర్ కోడ్‌తో తీసుకొచ్చింది. పన్ను చెల్లింపుదారులు సులభంగా పైసా ఖర్చు లేకుండా ఈ కొత్త పాన్ కార్డును పొందవచ్చు. ఇంతకీ పాన్ 2.0 కార్డును ఎలా అప్లయ్ చేసుకోవాలి? ఎవరు అర్హులు? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధానంగా చాలా మందికి పాన్ కార్డ్ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ అత్యంత ముఖ్యమైనది. మన వివరాలన్నీ అందులోనే ఉంటాయి. వ్యక్తగత, వ్యాపారపరంగా మాత్రమే కాకుండా ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులకు సైతం పాన్ కార్డులు ఉపయోగపడతాయి. ఈ పాన్ కార్డులను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ప్రతి వ్యక్తికి విడిగా 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్ జారీ అవుతుంది.
కేంద్రం రూపొందించిన పాన్ కార్డ్ 2.0 చాలా సురక్షితమైనది. చూసేందుకు ఇది అచ్చం ఏటీఎం కార్డు మాదిరిగానే ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. పాన్‌కార్డ్ 2.0లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ముఖ్యంగా, సైబర్ నేరగాల నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు అనేక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే, ఈ పాన్ కార్డును జారీ చేసేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి రుసుము వసూలు చేయదు.
పాన్ 2.0 ముఖ్య ఫీచర్లు :
సింగిల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ : పాన్, టాన్ సర్వీసులను ఒకే చోట లింక్ చేస్తుంది.
కేంద్రీకృత డేటా రిపోజిటరీ : పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని సురక్షితంగా స్టోర్ చేస్తుంది.
క్యూఆర్ కోడ్ ఇంటిగ్రేషన్ : వెరిఫికేషన్, అథెంటకేషన్ చేయడం చాలా ఈజీ
పాన్ 2.0 బెనిఫిట్స్ :
స్పీడ్ ప్రాసెసింగ్ : పాన్ కార్డు జారీ ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది.
సమస్య పరిష్కారం : వినియోగదారు సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చు
అడ్వాన్స్ సెక్యూరిటీ : సెంట్రలైజడ్ స్టోరేజీ ద్వారా డేటా ప్రొటెక్షన్ అందిస్తుంది
ఖర్చులు తగ్గింపు : డిజిటల్ లావాదేవీల ద్వారా సంబంధిత ఖర్చులు తగ్గుతాయి.
పాన్ 2.0కి అర్హతలివే :
ఇప్పటికే ఉన్న పాన్ కార్డుదారులు తిరిగి అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాన్ 2.0కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కొత్త క్యూఆర్ ఎనేబుల్డ్ వెర్షన్ కోసం రిక్వెస్ట్ చేయాలి. కొత్తగా పాన్ కార్డు తీసుకునేవారు మాత్రం ప్రామాణిక అర్హతలు కలిగి ఉండాలి. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటివి అందించాలి. ఈ అప్‌గ్రేడ్ పన్ను చెల్లింపుదారులందరు ఉచితంగా పొందవచ్చు.
పాన్ కార్డు 2.0 సంబంధించి చాలామందిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్యూఆర్ కోడ్ పాన్ కార్డ్ తీసుకుంటే ప్రస్తుత పాన్ కార్డ్ పనిచేయదా? అనే ప్రశ్న వినిపిస్తోంది. వాస్తవానికి, పాన్ కార్డ్ 2.0 అమల్లోకి వచ్చాక పాత పాన్ కార్డులు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి.
పాత పాన్ కార్డుతో మీ పని ఆగదు. మీ పాన్ కార్డులో ఏదైనా తప్పు ఉంటే కొత్త పాన్ కార్డులో మార్చుకోవచ్చు. క్యూఆర్ కోడ్ కూడా పాన్‌కార్డ్ 2.0లో రిజిస్టర్ అవుతుంది. కార్డుదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాన్‌కార్డ్ 2.0 అందుబాటులోకి తీసుకొచ్చింది.
పాన్ కార్డు ఎలా దరఖాస్తు చేయాలంటే? :
- ముందుగా, మీరు అధికారిక పోర్టల్ (https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html)కి వెళ్లాలి.
- వెబ్‌పేజీలో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి : గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, పుట్టిన తేదీ వివరాలతో కూడిన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ రివ్యూ చేయండి : మీ దరఖాస్తును సబ్మిట్ చేసే ముందు ఎంటర్ చేసిన అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి.
- అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత టిక్ బాక్స్‌ను ఎంచుకుని ఆపై (Submit) క్లిక్ చేయండి.
- అప్పుడు, మీకు స్ర్కీన్‌పై కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆదాయపు పన్ను శాఖతో అప్‌డేట్ చేసిన మీ ప్రస్తుత వివరాలను చెక్ చేయాలి.
- మీకు వన్-టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. OTP ఎంటర్ వెరిఫై చేసుకోవాలి.
- మీరు Continue ఆప్షన్ క్లిక్ చేయాలి.
- మీ కొత్త పాన్ కార్డు ఈమెయిల్ ఐడీకి డెలివరీ అవుతుంది.
పాన్ 2.0 దరఖాస్తు కోసం అవసరమైన డాక్యుమెంట్లు :
డేట్‌ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ : జనన ధృవీకరణ పత్రం, స్కూల్ టీసీ లేదా పాస్‌పోర్ట్.
ఐడెంటిటీ వెరిఫికేషన్ : ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్.
అడ్రస్ ప్రూఫ్ : బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, యుటిలిటీ బిల్లులు లేదా రెంట్ అగ్రిమెంట్స్