Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు..!
Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌లో ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ S25, ఐఫోన్ 15, ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ S24, ఐఫోన్ 16e ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Flipkart Sale Offers
Flipkart Sale Offers : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు (మార్చి 7) మొదలైంది. ప్రీమియం, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ సేల్ మార్చి 13 వరకు కొనసాగుతుంది.
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ S25 లైనప్, ఐఫోన్ 15, ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ S24, నథింగ్ ఫోన్ 2A ప్లస్, ఐఫోన్ 16e, మోటో G85 వంటి ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అందుబాటులో ఉన్న టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్‌లను ఓసారి లుక్కేయండి.
ఆపిల్ ఐఫోన్ 16 :
ఆపిల్ ఐఫోన్ 16 అసలు రిటైల్ ధర రూ.79,900 ఉండగా, సేల్ సందర్భంగా ధర రూ.59,999కి ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ ఐఫోన్ 16 ధర ఆఫర్ల ద్వారా అందిస్తోంది. రూ.10,901 ఫ్లాట్ డిస్కౌంట్, రూ.4వేలు HDFC బ్యాంక్ ఆఫర్, రూ.5వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి.
ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో ధర వరుసగా రూ.69,999, రూ.1,03,900కు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఐఫోన్ 16e కూడా రూ.55,900 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ లాంచ్ ధర రూ.59,900 నుంచి రూ. 4వేలు తగ్గింది.
ఆపిల్ ఐఫోన్ 15 :
ఆపిల్ పాత మోడళ్ల ధర కూడా తగ్గనుంది. ఐఫోన్ 15 ధర రూ.58,999 కాగా, ఐఫోన్ 13 రూ.40,999కి అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 :
ఫ్లిప్‌కార్ట్ కూడా శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S24 ధర రూ.52,999 కాగా, శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ రూ.54,999కి అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ ప్లస్ వేరియంట్ బిగ్ స్క్రీన్, లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 :
శాంసంగ్ నెక్స్ట్ జెన్ ఫోన్ల కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ధర రూ.73,999కు అందుబాటులో ఉంది. అదే సమయంలో, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూసే కొనుగోలుదారులు శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 లాంచ్ ధర రూ.1,64,999 నుంచి ధర రూ.1,49,999కు కొనుగోలు చేయవచ్చు.
నథింగ్, మోటోరోలా, పోకో ఫోన్‌లపై డీల్స్ :
ఆపిల్, శాంసంగ్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లకు కూడా విస్తరించింది. ఈ సేల్ సమయంలో నథింగ్ ఫోన్ 2a, నథింగ్ ఫోన్ 2a ప్లస్ వరుసగా రూ.19,999, రూ.25,499 ధరలకు లభ్యమవుతున్నాయి.
మోటోరోలా యూజర్లు మోటో ఎడ్జ్ 50 ధర రూ.20,999కు పొందవచ్చు. మోటో G85 ధర రూ.15,999కు పొందవచ్చు. పోకో ఎక్స్ 6 ప్రో ధర రూ.19,999కు కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఈ ధరలను ప్రకటించగా సేల్ సమయంలో మరిన్ని డిస్కౌంట్లు, ఆఫర్‌లు ఉండవచ్చు.