Samsung Galaxy S25 Edge : పిచ్చెక్కించే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వస్తోంది.. లాంచ్‌‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

Samsung Galaxy S25 Edge : శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ సిరీస్ వచ్చేస్తోంది. వచ్చే మే 23న ఈ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందుగానే ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ధర లీక్ అయింది.

Samsung Galaxy S25 Edge

Samsung Galaxy S25 Edge : శాంసంగ్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చే నెల మే 23న శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ లాంచ్ కానుంది. ఇప్పటివరకు శాంసంగ్ అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా రానుంది. గెలాక్సీ S25 సిరీస్‌లోని మోడళ్ల మాదిరిగానే ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో రానుంది.

Read Also : Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. అతి తక్కువ ధరకే వన్‌ప్లస్, ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు కొనేసుకోవచ్చు.. గెట్ రెడీ..!

గత జనవరిలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ సందర్భంగా కంపెనీ మొదట ఈ ఫోన్ గురించి హింట్ ఇచ్చింది. అప్పటినుంచి లాంచ్ గురించి అనేక లీకులు బయటకు వచ్చాయి. ఇటీవలి లీక్‌లు రాబోయే మోడల్ ధరను రివీల్ చేశాయి. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన గెలాక్సీ S25 ప్లస్ ధర కన్నా ఎక్కువగా ఉండవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ధర లీక్ :
బ్లూస్కీ సోషల్‌లోని టిప్‌స్టర్ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ధర CAD 1,678.99 నుంచి ప్రారంభమై ఉండవచ్చు. దాదాపు రూ. 1,03,000 వరకు ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ కన్నా ఎక్కువ. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 88,500 నుంచి అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో 8GB ర్యామ్+ 256GB, 12GB ర్యామ్ + 512GB టాప్-టైర్ వేరియంట్ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ధర CAD 1,858.99 (సుమారు రూ. 1,14,000) వరకు ఉండొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫీచర్ల విషయానికొస్తే.. టైటానియం సిల్వర్, టైటానియం జెట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 6.6-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ప్రైమరీ 200MP కెమెరా, సెకండరీ 12MP కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.

Read Also : Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. అతి తక్కువ ధరకే వన్‌ప్లస్, ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు కొనేసుకోవచ్చు.. గెట్ రెడీ..!

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ 12GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 5.8mm సన్నని డిజైన్‌తో వస్తుంది. 3,900mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 25W ఫాస్ట్ వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్టు ఇస్తుంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7 ఆధారంగా వన్ యూఐ 15లో రన్ అవుతుంది.