Samsung Galaxy S25 FE
Samsung Galaxy S25 FE : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ S24 లైనప్‌లో లాస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. శాంసంగ్ గెలాక్సీ S25 FE వచ్చే సెప్టెంబర్‌లో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. తద్వారా శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌లో చేరనుంది.
టిప్‌స్టర్ ప్రకారం.. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 FE లాంచ్ సెప్టెంబర్ 2025 చివరివారంలో జరగనుంది. లాంచ్‌కు ముందే శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి వివరంగా చూద్దాం..
శాంసంగ్ గెలాక్సీ S25 FE స్పెసిఫికేషన్లు (అంచనా) :
నివేదికల ప్రకారం.. రాబోయే శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో రానుంది. భారత్ సహా ఇతర మార్కెట్లలో శాంసంగ్ గెలాక్సీ S24, గెలాక్సీ S24 ప్లస్ పవర్ మాదిరిగా అదే చిప్ ఎక్సినోస్ 2400 SoC ద్వారా పవర్ పొందుతుంది.
ఈ చిప్ 12GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు UFS 4.0 స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 FE స్లిమ్ బెజెల్స్‌తో 6.7-అంగుళాల FHD+ LTPO అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,900mAh బ్యాటరీతో రానుంది.
బ్యాటరీ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. గెలాక్సీ S25 FE ఫోన్ ఆండ్రాయిడ్ 16పై వన్ యూఐ 8.0 స్కిన్‌తో రన్ అవుతుంది. 6 ఏళ్లు లేదా 7 ఏళ్ల OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించే అవకాశం ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ గెలాక్సీ S25 FE ఫోన్ OIS సపోర్టుతో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 3x జూమ్‌తో 8MP టెలిఫోటో షూటర్‌తో వస్తుంది.
ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా ఉండనుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్సీకి IP68 రేటింగ్ కలిగి ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. 7.8mm మందం, 190 గ్రాముల బరువు ఉండొచ్చు. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 FE ధర రూ. 60వేల కన్నా తక్కువ ఉండొచ్చని అంచనా.