Realme 15 Series Price : గెట్ రెడీ.. కొత్త రియల్‌మి 15 సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 24నే లాంచ్.. ధర, ఫుల్ స్పెసిఫికేషన్లు ఇవే..!
Realme 15 Series Price : రియల్‌మి 15 సిరీస్ వచ్చేస్తోంది. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్ల వివరాలు ముందే రివీల్ అయ్యాయి.

Realme 15 Series Price
Realme 15 Series Price : రియల్‌మి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ నెల 24న భారత మార్కెట్లోకి రియల్‌మి 15 సిరీస్ రాబోతుంది. ఈ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ఆవిష్కరించనుంది. రియల్‌మి 15, రియల్‌మి 15 ప్రో లైనప్‌లో ఉంటాయి. రియల్‌మి ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధర, ఇతర ఫీచర్ల పూర్తి వివరాలను టీజ్ చేసింది.. అవేంటో ఓసారి లుక్కేయండి..
భారత్‌లో రియల్‌మి 15 సిరీస్ ధర (అంచనా) :
టాప్-ఎండ్ రియల్‌మి 15 ప్రో వేరియంట్ బాక్స్ ధర రూ. 39,999గా నిర్ణయించారు. ధర రూ. 35వేల లోపు ఉంటుందని అంచనా. భారత మార్కెట్లో రియల్‌మి 15 ప్రో బేస్ ధర రూ. 30వేల లోపు ఉంటుందని అంచనా.
భారత మార్కె్ట్లో రియల్‌మి 15 5G ఫోన్ ధర రూ.25వేల కన్నా తక్కువ ధరలో రానుంది. రియల్‌మి 15 సిరీస్ లాంచ్ తేదీ జూలై 24న సాయంత్రం 7 గంటలకు (IST) జరుగుతుంది. రియల్‌మి 15 సిరీస్ లాంచ్ తర్వాత ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Realme 15 స్పెసిఫికేషన్లు :
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ సిరీస్ సిల్క్ పింక్, వెల్వెట్ గ్రీన్ ఫ్లోయింగ్ సిల్వర్ అనే కలర్ ఆప్షన్లు కలిగి ఉంది. రియల్‌మి 15 ప్రో వెల్వెట్ గ్రీన్, ఫ్లోయింగ్ సిల్వర్‌తో పాటు సిల్క్ పర్పుల్‌తో రానుంది.
రియల్‌మి 15లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300+ ప్రాసెసర్ ఉంటుంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రియల్‌మి 1.5K రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 6,500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 144Hz రిఫ్రెష్ రేటును అందిస్తుందని భావిస్తున్నారు.
ఫోటోగ్రఫీ పరంగా రియల్‌మి 15లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP సెన్సార్, ప్రైమరీ కెమెరా, అదనంగా 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ డిజైన్‌లో కేవలం 7.66mm స్లిమ్ ప్రొఫైల్ ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉంది.
రియల్‌మి 15 ప్రో స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 15 ప్రో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 80W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 7,000mAh బ్యాటరీని కలిగి ఉండొచ్చు. రియల్‌మి 15 ఫోన్ తగినట్టుగా డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు ఉంటాయి. సింగిల్ సైజులో గుడ్ క్వాలిటీని కలిగి ఉంటాయి.
రియల్‌మి 15 ప్రోలోని కెమెరా సెటప్‌లో OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP వద్ద అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉన్నాయి. 50MP సెల్ఫీ కెమెరాతో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిజైన్ సుమారు 7.69mm వద్ద కొంచెం మందంగా ఉంటుంది. IP68+IP69 ప్రొటెక్షన్ లెవల్ కూడా ఉంటుంది.