Samsung Galaxy S25
Samsung Galaxy S25 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25 భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఏడాది ప్రారంభంలో లాంచ్ కాగా ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ హార్డ్‌వేర్, ఫీచర్లతో అతి తక్కువ ధరకే లభిస్తోంది.
ఫెస్టివల్ సీజన్ తర్వాత శాంసంగ్ గెలాక్సీ S25 ధర భారీ (Samsung Galaxy S25) తగ్గింపు పొందింది. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 80వేల కన్నా డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. ప్రీమియం లుక్, ట్రిపుల్ కెమెరా సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర :
శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ ధర రూ.80,999 నుంచి రూ.60,900కు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో రూ.1,250 వరకు తగ్గింపు పొందవచ్చు. ధర రూ.60వేల కన్నా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు నెలకు రూ.2,953 ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు.
నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. పాత ఫోన్‌పై రూ.52వేల వరకు తగ్గింపు పొందవచ్చు. వర్కింగ్ కండిషన్ బట్టి అమెజాన్ ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తుంది. కొనుగోలుదారులు ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ 6.2-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ కలిగి ఉంది. 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. 4,000mAh బ్యాటరీతో 25W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ యూఐ 8పై రన్ అవుతుంది.
కెమెరా విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 50MP మెయిన్, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్ కలిగి ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. కచ్చితమైన ఆఫర్లు, ధరలకు సంబంధించి అమెజాన్ సైటులో చెక్ చేయండి.