PM Kisan 21st Installment : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 21వ వాయిదా వీరికి మాత్రమే.. కొత్తగా అప్లయ్ చేయాలంటే ఎలా? సింపుల్ ప్రాసెస్..!
PM Kisan 21st Installment : పీఎం కిసాన్ 21వ వాయిదా వచ్చే నవంబర్ నెలలో విడుదల కానుంది. అప్లయ్ చేసుకోవాలంటే ఈ అర్హతలు కలిగి ఉండాలి.
PM Kisan 21st Installment
PM Kisan 21st Installment : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో పీఎం కిసాన్ 21వ విడత అకౌంట్లో డబ్బులు పడనున్నాయి. మీరు కూడా పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులు అయితే వచ్చే నవంబర్ నెలలో రూ. 2వేలు విడుదల కావొచ్చు.
అయితే, మీరు ఒకవేళ ఇంకా పీఎం కిసాన్ (PM Kisan 21st Installment) లబ్ధిదారు కాకపోతే ఇప్పుడే పీఎం కిసాన్ కోసం అన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద రైతులు సంవత్సరానికి 3 సార్లు రూ. 2వేలు వాయిదాలను అందుకోవచ్చు.
మీరు రైతు అయితే ఈ పీఎం కిసాన్యోజనకు అర్హులైతే మీరు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రతి ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం పొందవచ్చు. ఈ ఏడాదిలో పీఎం కిసాన్ పథకం 21వ విడత విడుదల కావాల్సి ఉంది. వచ్చే నవంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 21వ విడత విడుదలకు ముందే ఈ పథకానికి ఎలా అప్లయ్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలంటే? :
- ఈ పథకానికి అప్లయ్ చేసుకోవాలంటే ముందుగా ఈ పథకం అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.
- మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ‘New Farmer Registraion’ ఆప్షన్ క్లిక్ చేయాలి.
- మీ వివరాలను సమర్పించాలి. ముందుగా 10 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- ముందుగా మీ రాష్ట్రం, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత ‘Get OTP’ పై క్లిక్ చేసి అందుకున్న OTP ఎంటర్ చేయండి.
- మీరు ల్యాండ్ డాక్యుమెంట్లు, అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- బ్యాంక్ పాస్‌బుక్ కూడా అప్‌లోడ్ చేయండి.
ఆ తర్వాత Submit ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ వెరిఫై అవుతుంది. మీ వివరాలు అన్ని సరిగ్గా ఉందని రుజువైతే మీ పేరు పథకం లబ్ధిదారుల జాబితాలో యాడ్ అవుతుంది. ఆ తర్వాత పథకం కింద రూ. 2వేలు పొందవచ్చు.
ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేయండిలా :
మీరు పీఎం కిసాన్ యోజనకు ఆన్‌లైన్‌లో లేదంటే ఆఫ్‌లైన్‌లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ సమీపంలోని CSC సెంటర్ విజిట్ చేయాలి. మీరు అక్కడ అప్లయ్ చేసుకుని పీఎం కిసాన్ పథకంలో చేరవచ్చు.
