PM Kisan 21st Installment
PM Kisan 21st Installment : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో పీఎం కిసాన్ 21వ విడత అకౌంట్లో డబ్బులు పడనున్నాయి. మీరు కూడా పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులు అయితే వచ్చే నవంబర్ నెలలో రూ. 2వేలు విడుదల కావొచ్చు.
అయితే, మీరు ఒకవేళ ఇంకా పీఎం కిసాన్ (PM Kisan 21st Installment) లబ్ధిదారు కాకపోతే ఇప్పుడే పీఎం కిసాన్ కోసం అన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద రైతులు సంవత్సరానికి 3 సార్లు రూ. 2వేలు వాయిదాలను అందుకోవచ్చు.
మీరు రైతు అయితే ఈ పీఎం కిసాన్యోజనకు అర్హులైతే మీరు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రతి ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం పొందవచ్చు. ఈ ఏడాదిలో పీఎం కిసాన్ పథకం 21వ విడత విడుదల కావాల్సి ఉంది. వచ్చే నవంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 21వ విడత విడుదలకు ముందే ఈ పథకానికి ఎలా అప్లయ్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలంటే? :
ఆ తర్వాత Submit ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ వెరిఫై అవుతుంది. మీ వివరాలు అన్ని సరిగ్గా ఉందని రుజువైతే మీ పేరు పథకం లబ్ధిదారుల జాబితాలో యాడ్ అవుతుంది. ఆ తర్వాత పథకం కింద రూ. 2వేలు పొందవచ్చు.
ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేయండిలా :
మీరు పీఎం కిసాన్ యోజనకు ఆన్‌లైన్‌లో లేదంటే ఆఫ్‌లైన్‌లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ సమీపంలోని CSC సెంటర్ విజిట్ చేయాలి. మీరు అక్కడ అప్లయ్ చేసుకుని పీఎం కిసాన్ పథకంలో చేరవచ్చు.