Vivo T4 5G : కొత్త వివో T4 5G భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే..? ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Vivo T4 5G : వివో కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Vivo T4 5G
Vivo T4 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కొనేసుకోండి. వివో T4 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ వివో T4 5జీ ఫోన్ రూ. 26వేలకు లాంచ్ కాగా రూ. 20వేల కన్నా తక్కువ ధరకు కొనేసుకోవచ్చు. 6.77-అంగుళాల భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ 7300mAh బ్యాటరీ కలిగి ఉంది. ఈ వివో ఫోన్(Vivo T4 5G)లో అందుబాటులో ఉన్న మరిన్ని డీల్స్ ఇప్పుడు చూద్దాం..
వివో T4 5Gపై డిస్కౌంట్ ఆఫర్లు :
వివో T4 5G ఫోన్ అసలు ధర రూ. 25,999 ఉండగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా రూ. 20,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై నేరుగా రూ. 5వేలు డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో రూ. 1,500 తగ్గింపు పొందవచ్చు. తద్వారా వివో ఫోన్ ధర రూ. 19,499కి తగ్గుతుంది.
మీరు ఈ వివో ఫోన్ రూ. 20వేల కన్నా తక్కువ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఈ వివో ఫోన్ ధర రూ. 19,250కి తగ్గుతుంది. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు బడ్జెట్ ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ.2వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Realme GT 7 Discount : అమెజాన్ ఆఫర్ అదుర్స్.. రియల్‌మి జీటీ 7పై అద్భుతమైన డిస్కౌంట్.. ఈ డీల్ మీకోసమే..!
వివో T4 5G కొన్ని స్పెషల్ ఫీచర్లు :
వివో T4 5G ఫోన్ 6.77-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. 5000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్టు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 5G ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 7300mAh బ్యాటరీని అందిస్తుంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ వివో ఫోన్ సన్నని డిజైన్‌తో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ మిలిటరీ-గ్రేడ్ ఆప్షన్ కూడా కలిగి ఉంది.
