Realme GT 7 Discount : అమెజాన్ ఆఫర్ అదుర్స్.. రియల్‌మి జీటీ 7పై అద్భుతమైన డిస్కౌంట్.. ఈ డీల్ మీకోసమే..!
Realme GT 7 Discount : రియల్‌మి జీటీ 7 ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో ఈ రియల్‌మి ఫోన్ రూ. 7వేలు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.
Realme GT 7 Discount
Realme GT 7 Discount : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్‌లో రియల్‌మి జీటీ 7 ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసినప్పటికీ కూడా రియల్‌మి జీటీ 7 ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. పండగ సేల్ సమయంలో మిస్ అయితే ఇప్పటికీ పాపులర్ ఫోన్లపై అద్భుతమైన డిస్కంట్లతో పొందవచ్చు.
రియల్‌మి జీటీ 7పై రూ.7వేల కన్నా ఎక్కువ (Realme GT 7 Discount) తగ్గింపు పొందవచ్చు. గతంలో కన్నా చాలా సరసమైన ధరకే లభిస్తోంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, పవర్‌ఫుల్ డిస్‌ప్లే, లాంట్ బ్యాటరీ లైఫ్ కావాలంటే రియల్‌మి జీటీ 7 అద్భుతమైన ఆప్షన్. ఈ డీల్ ఎలా పొందాలంటే?
రియల్‌మి జీటీ 7 అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో రియల్‌మి జీటీ 7 మోడల్ రూ.39,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.32,998కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం రియల్‌మి జీటీ 7పై రూ.7,001 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. సేవింగ్స్ కోసం పాత స్మార్ట్‌ఫోన్ కూడా ట్రేడ్ చేయవచ్చు.
రియల్‌మి GT 7 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి జీటీ 7 ఫోన్ 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ HDR10+కి కూడా సపోర్టు ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ GG7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. రియల్‌మి జీటీ 7 ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9400e ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కలిగి ఉంది.
