Samsung Galaxy S25 Ultra 5G ( Image Credit to Original Source)
Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్ మిస్ అయ్యారా? డోంట్ వర్రీ.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్..
అన్ని బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ వాల్యూ, ధర తగ్గింపుతో ఈ శాంసంగ్ ఫోన్ కేవలం రూ.75వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ భారత మార్కెట్లో రూ.1,29,999కి లాంచ్ అయింది. కెమెరా, బ్యాటరీతో పాటు ప్రీమియం డిజైన్, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర ఎంతంటే? :
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ధర రూ.1,11,999కి అందుబాటులో ఉంది. లాంచ్ ధర నుంచి రూ.18వేల ధర తగ్గింపుతో లభిస్తోంది. మీరు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో దాదాపు రూ.1,500 సేవ్ చేసుకోవచ్చు. ధర దాదాపు రూ.1,10,499కి తగ్గుతుంది.
కానీ, ఇక్కడ ట్విస్ట్ ఉంది.. అది ఏంటంటే.. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే గరిష్టంగా రూ.35,950 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ శాంసంగ్ ఫోన్ వాల్యూ రూ.75వేల కన్నా తక్కువగా ఉంటుంది. కచ్చితమైన వాల్యూ, వర్కింగ్ కండిషన్లు, డివైజ్ ఎంత పాతది, ఏ వేరియంట్‌పై అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది.
అమెజాన్‌లో 512GB వేరియంట్ రూ. 23వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్ ఈఎంఐలో కూడా కొనేసుకోవచ్చు. అవసరమైతే ఇతర యాడ్-ఆన్స్ కూడా ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెషిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ పేన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 12GB ర్యామ్, 1TB స్టోరేజ్‌తో పాటు గెలాక్సీ కోసం కస్టమ్-ట్యూన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ (3nm ప్రాసెస్)తో వస్తుంది.
45W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఫొటోల కోసం ఈ శాంసంగ్ ఫోన్ 200MP మెయిన్, 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ లెన్స్‌లను అందిస్తుంది. 10MP టెలిఫోటో లెన్స్‌ను కూడా అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.