Samsung Galaxy S25 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. శాంసంగ్ టాప్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ అతి తక్కువ ధరకే కొనేసుకోండి. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే శాంసంగ్ పవర్‌హౌస్ మోడల్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. అసలు ధర రూ. రూ.1,29,999కి నుంచి ఇప్పుడు అమెజాన్ అందించే డిస్కౌంట్లతో దాదాపు రూ.1,02,700కి అమ్ముడవుతోంది. అంటే.. మీరు రూ.27వేలకు పైగా ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
2/6
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర తగ్గింపు : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ప్రస్తుతం రూ.1,05,900 ధరకు అందుబాటులో ఉంది. అసలు ధర నుంచి రూ.24,099 తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లించే వినియోగదారులు అదనంగా రూ.3,177 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
3/6
ప్రస్తుత ధర దాదాపు రూ.1,02,733కి తగ్గుతుంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ కోసం ప్లాన్ చేస్తుంటే.. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా భారీ మొత్తంలో తగ్గించుకోవచ్చు. మీ ఫోన్ మోడల్ కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్ విలువ రూ. 44,250 వరకు తగ్గింపు పొందవచ్చు.
4/6
శాంసంగ్ గెలాక్సీ 25 అల్ట్రా స్పెసిఫికేషన్లు : ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంది. 16GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. యాప్‌లు, ఫొటోలు మీడియాకు తగినంత స్టోరేజీ కలిగి ఉంది.
5/6
ఈ శాంసంగ్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. శాంసంగ్ S25 అల్ట్రాలో 200MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ లెన్స్, 10MP టెలిఫోటో షూటర్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి.
6/6
సెల్ఫీల విషయానికి వస్తే.. శాంసంగ్ టెస్టింగ్ చేసిన 12MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. శాంసంగ్ S25 అల్ట్రా ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం 7 మెయిన్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ రాబోయే సంవత్సరాలకు మరిన్ని అప్‌డేట్స్ అందిస్తుంది. కలర్ ఆప్షన్లలో టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం వైట్‌సిల్వర్ ఉన్నాయి.