Samsung Galaxy S25 Ultra : ఇది కదా డిస్కౌంట్.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్లు.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/8
Samsung Galaxy S25 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన డిస్కౌంట్. మీరు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ కొనేసుకోవచ్చు.
2/8
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ శాంసంగ్ ఫోన్ సుమారు రూ. 1,01,000 తగ్గింపు ధరకు లభిస్తోంది. ప్రారంభ ధరతో పోలిస్తే ధర రూ. 28,999 తగ్గింది. అదనపు బ్యాంక్ ఆఫర్లు ఈఎంఐ ఆప్షన్లతో వస్తుంది. ఇలా కొన్నారంటే ధర మరింత తగ్గే అవకాశం ఉంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
3/8
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ధర ఎంతంటే? : ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కేవలం రూ. 1,01,000కే లభిస్తోంది. ప్రారంభ ధర నుంచి ఏకంగా రూ. 28,999 ధర తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఆఫర్‌ ఇంకా తగ్గింపు పొందవచ్చు.
4/8
నెలకు రూ. 3,551 నుంచి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసి రూ. 37,600 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొంటే అమెజాన్ కొన్ని అదనపు యాక్సెసరీలను కూడా అందిస్తుంది.
5/8
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1440×3120 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X స్క్రీన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. ఎక్కువ కంటెంట్‌ స్టోరేజీ కోసం ఇందులో 12GB వరకు ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ మెమరీ ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంది. 45W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
6/8
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఇందులో 4 కెమెరాలు ఉన్నాయి. 200MP, 5x జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 3x జూమ్‌తో 10MP టెలిఫొటో కెమెరా, 50MP వైడ్-యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. హై ఎండ్ కెమెరా ఫీచర్లతో సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంది.
7/8
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G కొనాలా? వద్దా? : ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు అప్ గ్రేడ్ అవుతూనే ఉంటాయి. కొత్త హై-ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం చూస్తుంటే ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ లభిస్తోంది.
8/8
పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 200MP కెమెరా సిస్టమ్, హై క్వాలిటీ అమోల్డ్ డిస్‌ప్లే ఉన్నాయి. మీకు ఇదే ధరలో ఇతర ఫోన్లు కావాలంటే వివో X300 అల్ట్రా లేదా ఐఫోన్ 17 అల్ట్రాను కూడా కొనేసుకోవచ్చు.