Flipkart Freedom Day Sale : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ శాంసంగ్ S25 అల్ట్రాపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర జస్ట్..
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ అల్ట్రా ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- July 31, 2026 / 01:46 PM IST
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. కొత్త జనరేషన్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S25 అల్ట్రా భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకు కొనేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ టైమ్ భారత మార్కెట్‌లో రూ. 1,29,999 ధరతో వచ్చింది.
డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు కూపన్లు, కార్డులు బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తగ్గించుకోవచ్చు. రూ. 85వేల లోపు ధరకే 6.9-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, రియర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా డీల్ ధర :
ఈ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ టైమ్ రూ. 1,29,999 ధరతో లాంచ్ చేశారు. ప్రస్తుతం రూ. 87,399కే లభిస్తోంది. రూ. 42,600 నేరుగా తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపుతో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలుదారులు అసలు ధరను మరో రూ. 4వేల వరకు తగ్గించుకోవచ్చు.
ఈ ఇ-కామర్స్ బ్రాండ్ నెలకు కేవలం రూ. 3,073 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.
మీ పాత శాంసంగ్ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లోని ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా ఎంచుకోవచ్చు. మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి రూ. 55,750 వరకు ఎక్స్ఛేంజ్ పొందవచ్చు. ఈ ఆఫర్లు లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కొనాలా? :
ఈ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై ప్రస్తుతం ధర భారీగా తగ్గింది. ఈ ధరకు 6.9-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్ లభిస్తాయి. ఇంటర్నల్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
గేమింగ్, మల్టీటాస్కింగ్ ఏఐ ఆధారిత ఫంక్షనాలిటీలకు అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. 12జీబీ వరకు ర్యామ్, 1టీబీ స్టోరేజ్ అందిస్తుంది.
కెమెరాల పరంగా చూస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రావైడ్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో, 10MP 3x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఆప్షన్ ఉంది. బ్యాటరీ కెపాసిటీ తక్కువ అయినా రోజంతా ఛార్జింగ్ వస్తుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ కెమెరాలు, లాంగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇష్టపడే వారైతే ఈ స్మార్ట్‌ఫోన్ అసలు వదులుకోవద్దు.
