Samsung Galaxy S26 Ultra : కొత్త శాంసంగ్ S26 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ధర, స్పెషిఫికేషన్లు ఇవే? ఫుల్ డిటెయిల్స్..!

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ లాంచ్‌కు సంబంధించి కీలక వివరాలు లీక్ అయ్యాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.

Samsung Galaxy S26 Ultra : కొత్త శాంసంగ్ S26 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ధర, స్పెషిఫికేషన్లు ఇవే? ఫుల్ డిటెయిల్స్..!

Samsung Galaxy S26 Ultra

Updated On : July 22, 2025 / 5:07 PM IST

Samsung Galaxy S26 Ultra : కొత్త శాంసంగ్ అల్ట్రా ఫోన్ రాబోతుంది. శాంసంగ్ నుంచి ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S-సిరీస్ లైనప్ నెక్ట్స్ జనరేషన్ ఫోన్ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్పెసిఫికేషన్‌లకు సంబంధించి లీక్‌లు బయటకు వచ్చాయి. ఈ హ్యాండ్‌సెట్ పాత డిజైన్‌తో రాబోతుందని అంచనా. ఇందులో మినిమలిస్టిక్ రియర్ ప్యానెల్, సన్నని బెజెల్, మెరుగైన స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్నాయి.

ఈ శాంసంగ్ బ్లాక్ పిక్సెల్ డెఫినిషన్ లేయర్ (PDL)తో కూడిన ఎన్‌క్యాప్సులేషన్ (CoE) OLED ప్యానెల్‌పై కలర్ ఫిల్టర్‌ను కూడా పొందే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్పెసిఫికేషన్లు (లీక్) :
రాబోయే శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ ముందున్న 6.9-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. అయితే, డిస్‌ప్లే థర్డ్ జనరేషన్ యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ గెలాక్సీ కస్టమ్ చిప్‌సెట్ కోసం ఓవర్‌లాక్డ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 ద్వారా సపోర్టు అందిస్తోంది.

Read Also : Realme 15 Pro : రియల్‌మి కొత్త సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, లాంచ్ డేట్, స్పెషిఫికేషన్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..!

ఈ శాంసంగ్ ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ ఆప్షన్లలో రావచ్చు. 256GB, 512GB, 1TB, 16GB ర్యామ్‌‌తో వస్తుంది. బ్యాటరీ పరంగా గెలాక్సీ S26 అల్ట్రా స్పీడ్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉండొచ్చు.

కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 200MP సోనీ లెన్స్‌తో పాటు రెండు 50MP సెన్సార్లు (ఒక పెరిస్కోప్, అల్ట్రా-వైడ్) బ్యాక్ ప్యానెల్‌లో 12MP టెలిఫోటో షూటర్‌ను కలిగి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్ టైమ్‌లైన్ :
షెడ్యూల్‌ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ జనవరి 2026లో గెలాక్సీ S26, గెలాక్సీ S26 ఎడ్జ్‌తో పాటు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ ప్లస్-సైజు మోడల్‌ను స్లిమ్మర్ ఎడ్జ్‌తో రిప్లేస్ చేస్తుందని భావిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర (లీక్) :
భారత మార్కెట్లో ఈ శాంసంగ్ బేస్ మోడల్ ధర దాదాపు రూ.1,59,990 ఉంటుందని అంచనా.