Samsung Galaxy Z Flip 5 5G : ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫ్లిప్ ఫోన్‌పై ఏకంగా రూ. 41,799 తగ్గింపు.. డోంట్ మిస్!
Samsung Galaxy Z Flip 5 5G : శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 5జీ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. అసలు ధర రూ. 99,999 నుంచి రూ. 41,799 తగ్గింపుతో కొనేసుకోవచ్చు.
Samsung Galaxy Z Flip 5 5G
- 6.7-అంగుళాల అమోల్డ్ 2X ఇంటర్నల్ డిస్ప్లే
- 12MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ సెటప్
- ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ. 39వేల వరకు తగ్గింపు
Samsung Galaxy Z Flip 5 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? రూ. 60వేల లోపు ధరలో కొత్త శాంసంగ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 5జీ ఫోన్ అమెజాన్‌లో ప్రస్తుం భారీ తగ్గింపుతో లభిస్తోంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు నేరుగా ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 5జీ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లకు (Samsung Galaxy Z Flip 5 5G) సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 5జీ ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 59,999 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లతో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 1,799 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఆపై ధర రూ. 58,200 అవుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో పాత ఫోన్‌పై రూ. 39వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది ప్రస్తుత మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫ్లిప్ ఫోన్ జూలై 2023లో రూ. 99,999 ధరకు లాంచ్ అయింది. రూ. 41,799 తగ్గింపుతో కొనేసుకోవచ్చు.
Read Also : Vivo Smartphones : వివో యూజర్లకు ఊహించని షాక్.. ఈ మోడళ్లపై భారీ ధరల పెంపు!
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫ్లిప్ 5 5జీలో 1,080×2,640 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 22:9 యాస్పెక్ట్ రేషియోతో 6.7-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ఇన్నర్ డిస్ప్లే ఉంది.
ఇందులో 720×748 పిక్సెల్స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ 306ppi పిక్సెల్ డెన్సిటీతో 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ ఫోల్డర్ షేప్ కవర్ డిస్ప్లే కూడా ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆధారిత వన్ యూఐ 5.1.1పై రన్ అవుతుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP ప్రైమరీ అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/1.8 అపర్చర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 12MP వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE,Wi-Fi 6e, బ్లూటూత్ 5.3, GPS, NFC, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌కు IPX8 రేటింగ్ కూడా ఉంది.
