Samsung Galaxy Z Fold 6, Galaxy Z Flip 6 Available
Samsung Galaxy Z Discount : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 గత జనవరిలో కంపెనీ గెలాక్సీ అన్‌ప్యాకడ్ ఈవెంట్ సందర్భంగా భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి.
ఇప్పుడు, ఈ ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు దేశంలో తగ్గింపు ధరలకు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ యూజర్ల కోసం పరిమిత-కాల పండుగ ఆఫర్‌గా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 రెండూ గెలాక్సీ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో రన్ అవుతాయి. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోన్ ప్రస్తుతం రూ. 1,44,999కి అందుబాటులో ఉంది. లాంచ్ ధరకు బదులుగా రూ. 1,64,999 తగ్గింపు ధరతో అందిస్తుంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ధర రూ. 89,999, అసలు ప్రారంభ ధరకు బదులుగా రూ. 1,09,999కు పొందవచ్చు. పరిమిత కాలపు పండుగ ఆఫర్‌లో భాగంగా ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌లను 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మోడల్ ఈఎంఐ ఆప్షన్ ధర రూ. 4,028, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6ని రూ. 2,500 ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు డివైజ్ ప్రొటెక్షన్ కోసం శాంసంగ్ గెలాక్సీ జెడ్ అస్యూరెన్స్‌ని కూడా పరిమిత కాలానికి రూ. 999 ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ అస్యూరెన్స్ ప్రోగ్రామ్ ద్వారా యూజర్లను ఒక ఏడాదిలో 2 క్లెయిమ్‌లను పొందేందుకు అనుమతిస్తుంది. వాస్తవానికి శాంసంగ్ మడతబెట్టే ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ధర రూ. 14,999, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ధర రూ. 9,999 తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోన్ నేవీ బ్లూ, పింక్, సిల్వర్ షాడో కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 బ్లూ, మింట్, సిల్వర్ షాడో షేడ్స్‌లో లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ 6.1.1 స్కిన్‌పై రన్ అవుతాయి. కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 గెలాక్సీ మొబైల్ ప్లాట్‌ఫారమ్‌తో అమర్చి ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోన్ 4,400mAh బ్యాటరీని అందిస్తుంది. అయితే, శాంసంగ్ ఫ్లిప్ మోడల్ 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ రెండు మోడల్స్ దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ48 రేటింగ్‌తో వచ్చాయి.
Read Also : Apple MacBook Pro M4 : ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో M4 వెర్షన్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ఈ డివైజ్ ధర ఎంతంటే?