Samsung Neo TV Models : శాంసంగ్ నుంచి ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫీచర్లతో 2 కొత్త నియో క్యూఎల్ఈడీ టీవీ మోడల్స్..!

Samsung Neo TV Models : శాంసంగ్ నుంచి సరికొత్త ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫీచర్లతో రెండు నియో క్యూఎల్ఈడీ టీవీ మోడల్స్ లాంచ్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Samsung Neo TV Models : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ భారత్‌లో కొత్త నియో క్యూఎల్ఈడీ 8కె, నియో క్యూఎల్ఈడీ 4కె, ఓఎల్ఈడీ టీవీ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ కొత్త పోర్ట్‌ఫోలియో అనేక ఏఐ-ఇంటిగ్రేటెడ్ ఫీచర్‌లను అందిస్తుంది. 55 అంగుళాల నుంచి 98 అంగుళాల వరకు వివిధ డిస్‌ప్లే సైజులలో అందుబాటులో ఉంది.

శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కె లైనప్‌లో అత్యంత ప్రీమియం ఆఫర్ ఎన్‌క్యూ8 ఏఐ జనరేషన్ 3 ఎస్ఓసీపై రన్ అవుతుంది. మెరుగైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ ప్రాసెసర్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)ని కలిగి ఉంది. నియో క్యూఎల్ఈడీ మోడల్‌లు గేమింగ్ కోసం కంపెనీ మోషన్ ఎక్స్‌లరేటర్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

భారత్‌లో శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కె, 4కె, ఓఎల్ఈడీ టీవీ ధర :
భారత మార్కెట్లో శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కె ప్రారంభ ధర రూ. 3,19,990కు పొందవచ్చు. నియో క్యూఎల్ఈడీ 4కె మోడల్‌ల ధర రూ. 1,39,990 నుంచి ప్రారంభమవుతుంది. శాంసంగ్ ఓఎల్ఈడీ రేంజ్ ప్రారంభ ధర రూ. 1,64,990కు పొందవచ్చు. ప్రత్యేక లాంచ్ ఆఫర్‌గా శాంసంగ్ రూ. 79,990 విలువైన సౌండ్‌బార్‌ను అందించనున్నట్లు తెలిపింది.

Read Also : OnePlus 11R Launch : వన్‌ప్లస్ సరికొత్త 11ఆర్ సోలార్ రెడ్ ఎడిషన్ వచ్చేస్తోంది.. ఈ నెల 18నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఈ కొత్త 2024 స్మార్ట్ టీవీ సిరీస్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు అదనపు ఖర్చు లేకుండా రూ. 29,990 విలువైన మ్యూజిక్ ఫ్రేమ్‌ను కూడా పొందవచ్చు. మోడల్ ఆధారంగా ఏప్రిల్ 30 వరకు ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ విలువ రూ. 59,990, కంపెనీ మోడల్‌ను బట్టి 20 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కె, 4కె, ఓఎల్ఈడీ టీవీ స్పెసిఫికేషన్‌లు :
శాంసంగ్ కొత్త నియో క్యూఎల్ఈడీ 8కె స్మార్ట్ టీవీలు క్యూఎన్900డీ, క్యూఎన్800డీ అనే 2 మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. 65-అంగుళాలు, 75-అంగుళాలు, 85-అంగుళాల స్క్రీన్ సైజుల్లో వస్తాయి. నియో క్యూఎల్ఈడీ 4కె క్యూఎన్85డీ, క్యూఎన్90డీ వేరియంట్‌లను కలిగి ఉంది. 55-అంగుళాల, 65-అంగుళాల, 75-అంగుళాల, 85-అంగుళాల, 98-అంగుళాల డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులో ఉంది. శాంసంగ్ ఓఎల్ఈడీ టీవీ 55-అంగుళాలు, 65-అంగుళాలు, 77-అంగుళాలు, 83-అంగుళాల స్క్రీన్‌లతో ఎస్95డీ, S90డీ మోడల్‌లలో వస్తుంది. కంపెనీ ప్రకారం.. ఎస్95డీ, ఎస్90డీ గ్లేర్-ఫ్రీ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి.

శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కె టీవీల కొత్త లైనప్ ఎన్‌పీయూతో ఎన్‌క్యూ8 ఏఐ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. గత జనరేషన్ నియో స్మార్ట్ టీవీలతో పోల్చితే.. న్యూరల్ నెట్‌వర్క్‌లలో 64 నుంచి 512 వరకు 8 రెట్లను అందిస్తుంది. మరోవైపు, నియో క్యూఎల్ఈడీ 4కె టీవీలు, ఓఎల్ఈడీ టీవీలు, ఎన్‌క్యూ4 ఏఐ జనరేషన్ 2 ప్రాసెసర్‌లపై పనిచేస్తాయి.

నియో క్యూఎల్ఈడీ 8కె రేంజ్ ఏఐ పిక్చర్ టెక్నాలజీ, ఏఐ అప్‌స్కేలింగ్ ప్రో, ఏఐ మోషన్ ఎన్‌హాన్సర్ ప్రో, రియల్ అండ్ డెప్త్ ఎన్‌హాన్సర్ ప్రో, ఏఐ కస్టమైజ్ మోడ్, ఏఐ ఎనర్జీ మోడ్ వంటి అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ గుర్తించడానికి ఆటోమాటిక్‌గా వాల్యూమ్‌ను ఎడ్జెస్ట్ చేసేలా శాంసంగ్ ఏఐ సౌండ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఏఐ ఆటో గేమ్ మోడ్ గేమ్, జానర్ రెండింటినీ గుర్తిస్తుంది. ఫొటో క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ సెట్టింగ్‌లను ఆటోమాటిక్‌గా ఎడ్జెస్ట్ చేస్తుంది.

శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 4కె సిరీస్ కలర్ కచ్చితత్వం, డాల్బీ అట్మోస్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యాన్‌టోన్ వెరిఫైడ్ టీవీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఓఎల్ఈడీ టీవీలో మోషన్ ఎక్స్‌లేరటర్ వంటి ఫీచర్లతో 144హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్లను సపోర్ట్ చేస్తుంది.

అన్ని కొత్త మోడల్‌లు 100 కన్నా ఎక్కువ ఛానెల్‌లతో ఫ్రీ స్ట్రీమింగ్ సర్వీసు శాంసంగ్ టీవీ ప్లస్‌కి యాక్సెస్‌ను అందిస్తాయి. స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కంట్రోల్ చేసేందుకు ఇంటర్నల్ ఐఓటీ హబ్‌ను కలిగి ఉంది. వీక్షకులు తమ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ కనెక్ట్ చేసిన అప్లియన్సెస్ కోసం యూనివర్సల్ రిమోట్‌కి అనుమతించే స్మార్ట్ మొబైల్ కనెక్ట్ ఫీచర్‌ను అందిస్తుంది. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ కూడా ఉంది.

Read Also : Suzuki Hayabusa Bike : సరికొత్త సుజుకి హయబుసా బైక్ వచ్చేసిందోచ్.. 25వ యానివర్శరీ సెలబ్రేషన్ ఎడిషన్ ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు