Samsung Galaxy Z Series : శాంసంగ్ మడతబెట్టే ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఏకంగా రూ.12వేలు డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy Z Fold 6 Launch : శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6ని కొనుగోలు చేసే కస్టమర్‌లు అప్‌గ్రేడ్ బోనస్ లేదా రూ. 12,500 విలువైన బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదనంగా, శాంసంగ్ 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.

Samsung Galaxy Z Series : శాంసంగ్ మడతబెట్టే ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఏకంగా రూ.12వేలు డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung offering cashback up to Rs 12k on Galaxy Z Fold 6 and Galaxy Z Flip 6

Updated On : October 4, 2024 / 10:29 PM IST

Samsung Galaxy Z Fold 6 Launch : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ రెండు సరికొత్త ఫోల్డుబల్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్6, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్6 పై అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లు పరిమిత-కాల పండుగ ప్రమోషన్‌లో అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6లో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6పై డిస్కౌంట్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6ని కొనుగోలు చేసే కస్టమర్‌లు అప్‌గ్రేడ్ బోనస్ లేదా రూ. 12,500 విలువైన బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదనంగా, శాంసంగ్ 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ధర రూ. 1,64,999, ఈఎంఐ ప్లాన్‌లు నెలకు రూ. 4,584 నుంచి ప్రారంభమవుతాయి.

Read Also : Lava Agni 3 Launch : డ్యూయల్ డిస్‌ప్లే, ఐఫోన్ మాదిరి యాక్షన్ బటన్‌తో లావా అగ్ని 3 ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతంటే?

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 అనేది నోట్ అసిస్ట్, స్కెచ్ టు ఇమేజ్,ఇన్‌స్టంట్ స్లో-మో వంటి అడ్వాన్‌డ్ ఏఐ-పవర్డ్ ఫీచర్‌లతో ఫోల్డబుల్ ప్రీమియంతో వస్తుంది. గేమింగ్, మల్టీమీడియాకు ఆప్టిమైజ్ చేసిన 2,600 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌తో పెద్ద 7.6-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆర్మర్ అల్యూమినియం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో మెరుగైన ఆప్షన్ కలిగి ఉంది.

గెలాక్సీ జెడ్ ఫ్లిప్6పై డిస్కౌంట్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్6 పట్ల ఆసక్తి ఉన్నవారికి శాంసంగ్ అప్‌గ్రేడ్ బోనస్ లేదా రూ. 11వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఫోల్డ్6 మాదిరిగా ఈ ఫోన్ కూడా 24-నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో వస్తుంది. నెలకు రూ. 3,056 నుంచి ప్రారంభమవుతుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్6 ధర రూ.1,09,999కు పొందవచ్చు.

శాంసంగ్ జెడ్ ఫ్లిప్6 కాంపాక్ట్ 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ ఫ్లెక్స్‌విండో కలిగి ఉంది. ఫ్లెక్స్‌క్యామ్‌తో కూడా వస్తుంది. ఇప్పుడు ఫోటో కంపోజిషన్‌ను మెరుగుపరిచే ఆటో జూమ్ ఫంక్షన్‌ను కలిగి ఉంది. ఫోన్ కెమెరా సిస్టమ్, 50ఎంపీ వైడ్, 12ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్‌లను కలిగి ఉంది. మెరుగైన ఇమేజ్ క్లారిటీని అందిస్తుంది.

మరెన్నో బెనిఫిట్స్ :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ అస్యూరెన్స్ ప్రోగ్రామ్‌ను రెండు ఫోన్లపై తగ్గింపు ధర రూ.999తో అందిస్తోంది. వాస్తవానికి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్6 ధర రూ. 14,999, ఫ్లిప్6 ధర రూ. 9,999కు అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ సంవత్సరానికి రెండు క్లెయిమ్‌లతో డివైజ్ ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఈ రెండు ఫోన్లు శాంసంగ్ అసూరెన్స్ ప్రొగ్రామ్‌తో అమర్చి ఉంటాయి. బ్రాండ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ డేటా ప్రొటెక్షన్ నిర్ధారిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్6 భారత్‌లో ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్‌ల వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Read Also : iPhone 13 Price Drop : ఆపిల్ ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!