Tesla Cyber Trucks : శాంసంగ్‌, టెస్లా బిగ్ డీల్.. సైబర్‌ట్రక్‌ కెమెరా మాడ్యుల్స్..!

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్, ఎలన్ మస్క్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు టెస్లా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరు కంపెనీల మధ్య 436 మిలియన్ డాలర్లతో డీల్ కుదిరినట్టు తెలిసింది.

Samsung Tesla Cybertruck cameras : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్, ఎలన్ మస్క్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు టెస్లా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరు కంపెనీల మధ్య 436 మిలియన్ డాలర్లు (రూ. 3 వేల కోట్లు)తో డీల్ కుదిరినట్టు తెలిసింది. అమెరికాలో టెస్లా తయారుచేసే సైబర్ ట్రక్ (Tesla Cybertruck) వాహనాల్లో లేటెస్ట్ కెమెరా మాడుల్స్ ను శాంసంగ్ సరఫరా చేయనుంది. ఈ సైబర్‌ ట్రక్‌ వాహనాల్లో కెమెరా మాడ్యూల్స్ (Samsung camera modules) ను అమర్చేందుకుగాను శాంసంగ్‌ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు ఒక నివేదికలో సౌత్ కొరియన్ దిగ్గజం పేర్కొంది.

టెస్లా లేటెస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల్లో శాంసంగ్ కెమెరా మాడ్యూల్స్ ను వినియోగించనుంది. 2019లోనే టెస్లా ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించింది. శాంసంగ్‌, టెస్లా కంపెనీలు డీల్‌ కుదుర్చుకోవడం ఇదేమి మొదటిసారి కాదు.. గతంతో టెస్లా కంపెనీకు ఎలక్ట్రిక్‌ వాహానాలకు సంబంధించిన బ్యాటరీలను శాంసంగ్‌ సరఫరా చేసింది. శాంసంగ్‌ తయారుచేసిన PixCell LED headlamp టెస్లా ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగించనుంది.

సైబర్‌ట్రక్‌ వెహికల్స్ కోసం ఇప్పటివరకు 1 మిలియన్ మంది (10 లక్షలు) రిజర్వేషన్లు చేసుకున్నట్టు టెస్లా వెల్లడించింది. టెస్లా సైబర్ ట్రక్ (Tesla Cybertruck) వాహనాలన్నీ 4 వీల్ డైరెక్షనల్ స్టీరింగ్ తో రానున్నాయి. చూడటానికి అచ్చం Hummer EV’s ‘Crab mode మాదిరిగానే ఫీచర్లు ఉండనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు