×
Ad

Sanchar Saathi App : ఇకపై అన్ని స్మార్ట్‌ఫోన్లలో ‘సంచార్ సౌథీ’ యాప్.. డిలీట్ చేయలేరు.. ఎందుకంటే? ఫుల్ డిటెయిల్స్..!

Sanchar Saathi App : ఇకపై అన్ని స్మార్ట్‌ఫోన్లలో ప్రభుత్వ యాప్ సంచార్ సౌథీ ఉండాల్సిందే.. ఈ ప్రీలోడ్ యాప్ డిలీట్ చేయలేని విధంగా ఉండాలని తయారీదారులను కేంద్రం ఆదేశించినట్టు నివేదికలు పేర్కొన్నాయి.

Sanchar Saathi App

Sanchar Saathi App : స్మార్ట్‌ఫోన్ యూజర్ల భద్రత దృష్ట్యా సైబర్ మోసాలు, మొబైల్ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ సైబర్ భద్రతా యాప్ సంచార్ సౌథీని ప్రీ-లోడింగ్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించాలని ప్రభుత్వం అన్ని మొబైల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దొంగిలించిన మొబైల్‌లను కనిపెట్టడంతో పాటు ఫేక్ IMEI నంబర్‌లను గుర్తించడం, మోసపూరిత కాల్‌లకు సంబంధించిన సమాచారాన్ని పొందడంలో ఈ యాప్ సాయపడుతుంది.

ప్రభుత్వ డేటా ప్రకారం.. ఈ యాప్ సాయంతో లక్షలాది దొంగిలించిన ఫోన్లను గుర్తించారు. ఆపిల్ వంటి కంపెనీలు ఈ ఆర్డర్‌ను ఇష్టపడలేదని చెబుతున్నారు. ఆపిల్ పాలసీ ప్రకారం.. ఐఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన ఏదైనా ప్రీ-లోడ్ యాప్‌తో ఫోన్‌లను విక్రయించదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

ప్రీలోడ్ యాప్ డిలీట్ చేయలేరు :
నవంబర్ 28న భారత మార్కెట్లో తయారైన లేదా విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో సంచార్ సాథీ యాప్ ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉండాలని, వినియోగదారులు ఇకపై యాప్ ఫోన్ నుంచి డిలీట్ చేయలేరని ప్రభుత్వం ఒక అడ్వైజరీని జారీ చేసినట్టు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం.. ఈ కొత్త మార్పు అమలుకు కంపెనీలకు 90 రోజుల సమయం ఇచ్చింది. మొబైల్ కంపెనీలలో దీనిపై ఆందోళనలను రేకెత్తించింది. ఈ విషయంపై తమను ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆదేశాలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read Also : LPG Gas Prices : బిగ్ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన LPG గ్యాస్ సిలిండర్ల ధరలు.. కొత్త ధరలివే..!

సంచార్ సాథీ యాప్‌ ఎందుకంటే? :
నివేదిక ప్రకారం.. మొబైల్ దొంగతనం, ఫేక్ IMEI నంబర్లు, మోసపూరిత కాల్స్, సైబర్ మోసం వంటి సమస్యలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ ప్రభుత్వ యాప్ యూజర్లను దొంగిలించిన ఫోన్‌లను బ్లాక్ చేయడం, అనుమానాస్పద కాల్స్ రిపోర్టు చేయడం, IMEI వ్యాలిడిటీ ఉందో లేదో చెక్ చేయొచ్చు. ఈ యాప్ జాతీయంగా మొబైల్ భద్రతను బలపరుస్తుంది. దొంగిలించిన ఫోన్‌లను విక్రయించే నేరస్థులను పట్టిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

5 మిలియన్లకుపైగా డౌన్‌లోడ్ :
ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన సంచార్ సాథీ యాప్‌ను 5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం.. దొంగిలించిన లేదా పోగొట్టుకున్న 3.7 మిలియన్లకు పైగా ఫోన్‌లను బ్లాక్ చేసేందుకు ఈ యాప్ వాడారు. గత అక్టోబర్‌లో ఈ యాప్ 50వేల స్మార్ట్‌ఫోన్‌లను కూడా రాబట్టింది.

అంతేకాకుండా, 30 మిలియన్లకు పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్‌లను నిలిపివేసేందుకు ఈ యాప్‌ వినియోగించింది ప్రభుత్వం. సైబర్ మోసాల నుంచి సేఫ్‌గా ఉండేందుకు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దొంగిలించిన ఫోన్‌లను తిరిగి పొందవచ్చు. ఫేక్ నంబర్‌లు, IMEI నంబర్‌లను రిపోర్టు చేయడం, అనుమానాస్పద నంబర్‌లను చెక్ చేయడంలో ఈ యాప్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.