SBI Customers Alert : ఆ రెండు గంటలు.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేయవు!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. జూన్ 17న రెండు గంటల పాటు ఆన్ లైన్ సర్వీసులు పనిచేయవు.

SBI Customers Alert : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. జూన్ 17న రెండు గంటల
పాటు ఆన్ లైన్ సర్వీసులు పనిచేయవు. యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూనిఫైడ్ ఇంటర్ ఫేస్ (UPI) సర్వీసులు కూడా పనిచేయవు. గురువారం రాత్రి
12.30 నుంచి 2.30 గంటల వరకు ఎస్‌బీఐ సర్వీసులు నిలిచిపోనున్నాయి.

జూన్ 13న కూడా ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. బ్యాంకు సర్వీసుల్లో INB, YONO, YONO Lite, UPI సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. మెయింట్ నెన్స్ యాక్టివిటీస్ కోసం మే 21-23 వరకు కొన్ని గంటల పాటు కూడా ఆన్ లైన్ సర్వీసులను నిలిపివేసింది ఎస్‌‌బీఐ. ఇదిలా ఉండగా, అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు HDFC మొబైల్ బ్యాంకింగ్ యాప్ కూడా నెట్ వర్క్ నిలిచిపోయింది. దాదాపు గంటపాటు నిలిచిపోయింది. గంట ఆలస్యంగా మంగళవారం ఉదయానికి సాంకేతిక సమస్యను పరిష్కరించినట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి.


దేశవ్యాప్తంగా ఎస్‌బీఐలో 22వేల బ్రాంచులు, 57,889 ఏటీఎంలు ఉండగా.. డిసెంబర్ 31 నాటికి 85 మిలియన్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్, 19 మిలియన్ల మొబైల్ బ్యాంకింగ్ యూజర్లు ఉన్నారు. అలాగే SBI YONO యూజర్లు 34.5 మిలియన్ల మంది ఉన్నారు. రోజుకు 9 మిలియన్ల మంది YONO యూజర్లు లాగిన్ అవుతున్నట్టు సంస్థ తెలిపింది. డిసెంబర్ 2020 నాటికి 91శాతంతో YONO ద్వారా ఎస్‌బీఐ 1.5 మిలియన్ల సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లను కలిగి ఉంది.

ట్రెండింగ్ వార్తలు