SBI Customers Alert : ఎస్బీఐ కస్టమర్లు ఈ యాప్స్ వాడొద్దు.. అకౌంట్ ఖాళీ అయినట్టే!

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ State Bank of India (SBI) తమ కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. సైబర్ మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తోంది. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లపై పూర్తిగా సెక్యూరిటీ ఉంటుందనే గ్యారెంటీ లేదు.

SBI Customers Alert : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ State Bank of India (SBI) తమ కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. సైబర్ మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తోంది. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లపై పూర్తిగా సెక్యూరిటీ ఉంటుందనే గ్యారెంటీ లేదు. బ్యాంకు సెక్యూరిటీలు ఉన్నప్పటికీ కూడా హ్యాకర్లు ఏదోరకంగా కస్టమర్ల అకౌంట్లలో డబ్బులను కాజేస్తున్నారు. ఇటీవలే ఎస్బీఐ తమ కస్టమర్లకు ట్విట్టర్ ద్వారా అలర్ట్ చేసింది.

గిఫ్ట్స్ లేదా క్యాష్ ప్రైజ్ అంటూ వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని సూచించింది. అలాంటి లింకులను క్లిక్ చేస్తే మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత డేటా, అకౌంట్లో డబ్బులు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతాయని హెచ్చరించింది. అంతేకాదు.. స్మార్ట్ ఫోన్లు లేదా కంప్యూటర్ సిస్టమ్స్ లలో కొన్ని నిర్దిష్ట యాప్స్ అసలే డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచిస్తోంది. ఫిషింగ్ (Phishing) వంటి లింకుల ద్వారా హ్యాకర్లు మీ డేటాను తస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

అలాంటి అనుమానాస్పద యాప్స్ డౌన్ లోడ్ చేయొద్దని సూచించింది. యాప్ అథెనింటిసిటీ, రివ్యూ, కామెంట్ల ఆధారంగా యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలో వద్దా నిర్ణయించుకోండి. యాప్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఫోన్లు, కంప్యూటర్లలో డౌన్ లోడ్ చేయొద్దని గట్టిగా హెచ్చరించింది. మరోవైపు KYC Fraud విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని SBI సూచిస్తోంది. KYC Update అంటూ ఏదైనా లింక్ వస్తే క్లిక్ చేయొద్దని సూచించింది.

బ్యాంకు అధికారుల మాదిరిగా సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ లు పంపి వ్యక్తిగత వివరాలను అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తే.. నమ్మొద్దని సూచించింది. అలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ http://cybercrime.gov.in లింక్ ద్వారా కంప్లయింట్ చేయొచ్చునని తెలిపింది. బ్యాంకు అధికారులు ఎప్పుడూ కూడా కస్టమర్ KYC అప్ డేట్ చేసుకోవాలని అడగరు.. అలాగే ఎవరితోనూ మీ పర్సనల్ డేటాను షేర్ చేసుకోవద్దని ఎస్బీఐ సూచించింది.

ట్రెండింగ్ వార్తలు