SBI Users : ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు!

దేశీయ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్బీఐ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఎస్బీఐ కస్టమర్లు తమ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే బ్యాంకులకు పరిగెత్తాల్సిన పనిలేదు.

SBI Users Alert : దేశీయ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్బీఐ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఎస్బీఐ కస్టమర్లు తమ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే బ్యాంకులకు పరిగెత్తాల్సిన పనిలేదు. ఏటీఎంలో కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాల్సిన పనిలేదు. మీ ఫోన్లలోని వాట్సాప్ అకౌంట్ ద్వారా సులభంగా మీ బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) WhatsApp బ్యాంకింగ్ సర్వీసును ప్రారంభించింది. ఎస్బీఐ అధికారిక ట్వీట్ ద్వారా ఈ సర్వీసును ప్రారంభించినట్లు ప్రకటించింది. వాట్సాప్‌లో అందుబాటులో బ్యాంకింగ్ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

ఎందుకంటే కొత్త యాప్‌ని డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు లేదా వారి అకౌంట్ బ్యాలెన్స్‌ చెక్ చేయడానికి ATMకి వెళ్లవలసిన అవసరం ఉండదని ఎస్బీఐ ట్వీట్ ద్వారా పేర్కొంది. మీ బ్యాంక్ ఇప్పుడు వాట్సాప్‌లో ఉంది. మీ అకౌంట్ బ్యాలెన్స్‌ని తెలుసుకోండి. మినీ స్టేట్‌మెంట్‌ను కూడా చెక్ చేసుకోవచ్చునని SBI ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. ప్రస్తుతానికి, WhatsAppలోని SBI వినియోగదారులు వారి అకౌంట్ బ్యాలెన్స్, మినీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను కూడా పొందవచ్చు. SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను పొందాలంటే వినియోగదారులు +919022690226 నంబర్‌కు ‘Hi’ని పంపవలసి ఉంటుంది. వాట్సాప్‌లో మీ SBI బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ పొందడానికి ఈ క్రింది విధంగా ఫాలో అవ్వండి.

1. మీరు ముందుగా SBI WhatsApp బ్యాంకింగ్ సర్వీసు కోసం మీ అకౌంట్ నమోదు చేసుకోవాలి.
2. ఈ సర్వీసు కోసం నమోదు చేయాలంటే మీరు బ్యాంక్‌లో రిజిస్టర్ చేసిన మీ 10 అంకెల మొబైల్ నంబర్ నుంచి 917208933148కి “SMS WAREG A/c No”ని పంపాలి.
3. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, +919022690226 నంబర్‌కు ‘Hi అని పంపండి.
4 : ఆ తర్వాత, ప్రియమైన కస్టమర్, SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం! అని మెసేజ్ వస్తుంది.

Sbi Users Can Now Check Bank Account Balance Through Whatsapp 

ఇందులో ఏదైనా ఆప్షన్ ఎంచుకోండి..

1. ఖాతా బ్యాలెన్స్ (Bank Account)

2. మినీ స్టేట్‌మెంట్ ( Mini Statement)

3. WhatsApp బ్యాంకింగ్ నుంచి De-Register చేసుకోండి.

4. మీ అవసరాలకు అనుగుణంగా ఆప్షన్ ఎంచుకోండి.

మీ అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేసేందుకు “1” టైప్ చేయండి. మినీ స్టేట్‌మెంట్ టైప్ 2 పొందండి. మీ అకౌంట్ బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్‌మెంట్ ఇప్పుడు WhatsAppలో కనిపిస్తుంది. అదనంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ యూజర్లు SBI కార్డ్ WhatsApp కనెక్ట్ పేరుతో WhatsApp ఆధారిత సేవలను కూడా అందిస్తుంది. ఈ సర్వీసు SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. రివార్డ్ పాయింట్‌లు, పెండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్, మరిన్నింటిని చెక్ చేసేందుకు అనుమతిస్తుంది.

Read Also : SBI Loan Waive Off: ఎస్‌బీఐకి షాకిచ్చిన కన్సూమర్ కోర్టు.. ఆ మహిళకు రూ.54 లక్షల రుణమాఫీ!

ట్రెండింగ్ వార్తలు