SBI Loan Waive Off: ఎస్‌బీఐకి షాకిచ్చిన కన్సూమర్ కోర్టు.. ఆ మహిళకు రూ.54 లక్షల రుణమాఫీ!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు కన్సూమర్ కోర్టు షాకిచ్చింది. బెంగళూరుకు చెందిన ధరణి అనే 36ఏళ్ల మహిళలకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. అంతేకాక మహిళ విషయంలో రూ. 54 లక్షల రుణాన్ని బ్యాంకు మాఫీ చేయాలని, ఆమెకు రూ. లక్ష పరిహారం, వ్యాజ్యం ఖర్చులు కింద రూ. 20వేలు చెల్లించాలని తీర్పు వెల్లడించింది.

SBI Loan Waive Off: ఎస్‌బీఐకి షాకిచ్చిన కన్సూమర్ కోర్టు.. ఆ మహిళకు రూ.54 లక్షల రుణమాఫీ!

Sbi

SBI Loan Waive Off: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు కన్సూమర్ కోర్టు షాకిచ్చింది. బెంగళూరుకు చెందిన ధరణి అనే 36ఏళ్ల మహిళలకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. అంతేకాక మహిళ విషయంలో రూ. 54 లక్షల రుణాన్ని బ్యాంకు మాఫీ చేయాలని, ఆమెకు రూ. లక్ష పరిహారం, వ్యాజ్యం ఖర్చులు కింద రూ. 20వేలు చెల్లించాలని తీర్పు వెల్లడించింది.

SBI: హోం లోన్ వడ్డీరేట్లు పెంచేసిన ఎస్బీఐ

బెంగళూరుకు చెందిన ధరణికి 36యేళ్లు. ఆమె వివాహిత. గతేడాది కరోనా వల్ల భర్త రూపేష్ రెడ్డి మరణించాడు. ఆమెకు ఎస్ బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రావాల్సిన డబ్బులు కోసం బ్యాంక్ సిబ్బందిని సంప్రదించింది. అయితే బ్యాంక్ సిబ్బంది మాత్రం ఆమెను లోన్ డబ్బులు చెల్లించాలని కోరారు. పలుసార్లు బ్యాంకు సిబ్బంది నుంచి ఇదే ఇబ్బంది ఎదురవ్వడంతో.. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ బెంగళూరు అర్బన్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్సూమర్ డిస్‌ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌ను ధరణి ఆశ్రయించింది. తన భర్త మరణం తర్వాత పిల్లలు, తల్లిదండ్రుల పోషణ, ఇంటి ఖర్చులు వంటి వాటికే డబ్బులు లేవని, కేవలం ఇన్సూరెన్స్ కవర్ మీదనే ఆధారపడ్డానని, కానీ బ్యాంక్ మాత్రం లోన్ మాఫీ చేయడం లేదని ఆమె కోర్టుకు తెలిపింది.

kambala: రికార్డుల పేరిట ‘కంబళ వీరుడి’ మోసం.. శ్రీనివాస గౌడపై కేసు నమోదు

ధరణి వాదనలపై బ్యాంక్ సిబ్బంది కౌంటర్ దాఖలు చేశారు. ధరణి, ఆమె భర్త ఇన్సూరెన్స్ పాలసీకోసం లిఖిత పూర్వకంగా అంగీకారం తెలియజేయలేదని, అఫ్లికేషన్ లో యస్ టిక్ పెట్టడం ద్వారా అంగీకారం తెలియజేశారని పేర్కొంది. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇష్యూ చేయలేదని, ప్రీమియం కట్ చేసుకున్నా కూడా అది ఎస్‌బీఐ లైఫ్‌కు చేరలేదని, ఈ కారణంగా రుణ గ్రహీతకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదని బ్యాంక్ సిబ్బంది కోర్టుకు తెలిపారు. అయితే బ్యాంక్ సిబ్బంది వాదనను కోర్టు తోసిపుచ్చింది. హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్ కవరేజ్ విషయంలో సర్వీసుల లోపం స్పష్టంగా కనిపిస్తోందని, లోన్ మంజూరు సమయంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకులదేనని కోర్టు తెలిపింది. రుణ గ్రహీతలకు తెలియజేయకుండానే ఇన్సూరెన్స్‌ను క్యాన్సల్ చేయడం రూల్స్‌కు వ్యతిరేకమని తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ సిబ్బంది తీరును తప్పుబడుతు తీర్పును వెలువరించింది.