kambala: రికార్డుల పేరిట ‘కంబళ వీరుడి’ మోసం.. శ్రీనివాస గౌడపై కేసు నమోదు

‘కంబళ పోటీ వీరుడు’ శ్రీనివాస గౌడ సాధించిన విజయాలు ఫేక్ అంటూ తాజాగా అతడిపై పోలీసు కేసు నమోదైంది. కంబళ పోటీల్లో ఫేక్ రికార్డులు నెలకొల్పి, వాటి ద్వారా వచ్చిన పేరుతో లక్షల రూపాయల విరాళాలు సేకరించాడని ఆయనపై చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

kambala: రికార్డుల పేరిట ‘కంబళ వీరుడి’ మోసం.. శ్రీనివాస గౌడపై కేసు నమోదు

Kambala

kambala: కర్ణాటకలో సంప్రదాయ కంబళ పోటీల్లో అరుదైన రికార్డులు నెలకొల్పిన శ్రీనివాస గౌడ సాధించిన విజయాలు ఫేక్ అంటూ అతడిపై తాజాగా పోలీస్ కేసు నమోదైంది. విరాళాల పేరుతో లక్షల రూపాయలు సేకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్ణాటకలో కంబళ అనే సంప్రదాయ క్రీడ గురించి తెలిసిందే. దున్నలతో కలిసి బురద నీటిలో పరుగెత్తడమే ఈ క్రీడ. ఎవరు తమ దున్నతో కలిసి వేగంగా పరుగెత్తి, లక్ష్యాన్ని చేరుకుంటే వారే విజేత.

Woman Gives Birth on Road: రోడ్డు ప్రమాదం.. ఆడబిడ్డను ప్రసవించి గర్భిణి మృతి

ఈ సంప్రదాయ క్రీడ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనివాస గౌడ. జమైకా రన్నర్ ఉసేన్ బోల్ట్ పరుగు పందెంలో నెలకొల్పిన రికార్డుల్ని శ్రీనివాస గౌడ కంబళ క్రీడలో బద్ధలు కొట్టాడు. ఉసేన్ బోల్ట్ వంద మీటర్లను 9.58 సెకండ్లలో పూర్తి చేస్తే, ఈ రికార్డును కంబళ క్రీడలో శ్రీనివాస గౌడ దాటేశాడు. ఆయన 145 మీటర్ల దూరాన్ని 9.55 సెకండ్లలో పూర్తి చేశాడు. ఉసేన్ బోల్ట్ 2009లో ఈ రికార్డు నెలకొల్పితే, శ్రీనివాస గౌడ 2020 ఫిబ్రవరి 1న దీన్ని బద్దలు కొట్టాడు. అందుకే అతడ్ని అందరూ ‘ఉసేన్ బోల్ట్ ఆఫ్ కర్నాటక’గా పిలుస్తారు. ఈ రికార్డుల ద్వారా అతడి పేరు దేశమంతా మారుమోగిపోయింది. జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.

Hyderabad Youtuber Suicide: వ్యూయర్స్ పెరగడం లేదని హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్య

అప్పట్లో కేంద్ర క్రీడాశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు శ్రీనివాస గౌడను ఢిల్లీకి ఆహ్వానించి, అభినందించారు. అప్పటి కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా శ్రీనివాస గౌడను సన్మానించారు. మరెందరో ప్రముఖులు ఆయన్ను సన్మానించి, ఆర్థిక సహాయం చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస గౌడ పలువురి దగ్గరి నుంచి విరాళాలు సేకరించారు. అయితే, ఈ అంశాలపైనే అతడిపై తాజాగా కేసు నమోదైంది. శ్రీనివాస గౌడ సాధించిన విజయాలు ఫేక్ అని, అలాగే జనాన్ని మోసం చేసి లక్షల రూపాయలు విరాళాలు సేకరించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దక్షిణ కన్నడ కంబళ కమిటీకి చెందిన లోకేశ్​ శెట్టి అనే సభ్యుడు మడ్​బిద్రి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస గౌడతోపాటు ఆయనకు శిక్షణ ఇచ్చిన కంబళ అకాడమీ నిర్వాహకుడు గుణపాల కదంబ, లేజర్ బీమ్ వాడి దున్నల వేగాన్ని లెక్కించే స్కైవీవ్ సంస్థ యజమాని రత్నాకర్‌ పేర్లను కూడా ఫిర్యాదులో చేర్చారు.

Terminate Pregnancy: 24 వారాల గర్భాన్ని తొలగించుకోవచ్చు.. అవివాహిత మహిళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

శ్రీనివాస గౌడ సాధించిన విజయాలు ఫేక్ అని చెప్పేందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఎఫ్ఐఆర్‌లో జత చేసినట్లు లోకేష్ శెట్టి తెలిపాడు. కర్ణాటక హోం మంత్రి, దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్​కు కూడా ఆ పత్రాలను పంపించినట్లు చెప్పారు. అవసరమైతే ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టులో కూడా ఫిర్యాదు చేస్తానని వివరించాడు.