Terminate Pregnancy: 24 వారాల గర్భాన్ని తొలగించుకోవచ్చు.. అవివాహిత మహిళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

వివాహం కాకుండానే గర్భం దాల్చిన మహిళ 24 వారాలలోపు గర్భాన్ని తొలగించుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవివాహిత అయిన కారణంగా ఆమె గర్భాన్ని తొలగించుకునే హక్కును నిరాకరించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Terminate Pregnancy: 24 వారాల గర్భాన్ని తొలగించుకోవచ్చు.. అవివాహిత మహిళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

Terminate Pregnancy

Terminate Pregnancy: అవివాహిత మహిళ 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించింది భారత సుప్రీంకోర్టు. ఆడ, మగ.. ఇద్దరి మధ్యా బంధం విషయంలో ఏకాభిప్రాయం కుదరనప్పుడు, ఆ బంధం వల్ల ఏర్పడ్డ గర్భాన్ని తొలగించుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ గర్భస్రావానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Woman Gives Birth on Road: రోడ్డు ప్రమాదం.. ఆడబిడ్డను ప్రసవించి గర్భిణి మృతి

జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం గురువారం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. మహిళకు వివాహం కానంత మాత్రాన ఆమె గర్భాన్ని తొలగించుకోవడాన్ని అడ్డుకోలేమని కోర్టు అభిప్రాయపడింది. 24 వారాల గర్భాన్ని తొలగించుకోవాలనుకుంటున్న పాతికేళ్ల మహిళ.. దీనికి అనుమతించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఇందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు… ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ, మహిళకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి 2021లో మార్పు చేసిన చట్టం ప్రకారం మహిళ గర్భాన్ని తొలగించుకునేందుకు ఆమె భాగస్వామినే పరిగణనలోకి తీసుకోవాలని..

Hyderabad Youtuber Suicide: వ్యూయర్స్ పెరగడం లేదని హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్య

దీనర్థం భర్త అని మాత్రమే కాదని, అందువల్ల మహిళ పెళ్లి కాకపోయినా గర్భస్రావం చేయించుకోవచ్చని తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన వైద్య నిపుణుల సమక్షంలో, మహిళ ప్రాణానికి ఎలాంటి హాని జరగకుండా గర్భస్రావం చేయొచ్చని కోర్టు సూచించింది. దీనికోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా ఎయిమ్స్‌ను ఆదేశించింది. వితంతువు అయినా, విడాకులు తీసుకున్న మహిళ అయినా, అవివాహిత అయినా గర్భం ఇష్టం లేకపోతే 20-24 వారాలలోపు గర్భస్రావం చేయించుకునే హక్కు ఉందని కోర్టు అభిప్రాయపడింది.