Scientists Revealed Mysterious Alien Space Craft Comet Actually Came From
mysterious Oumuamua alien space craft comet : సౌర వ్యవస్థ గుండా వెళ్లిన మొట్టమొదటి నక్షత్రపు వస్తువుకు సంబంధించి మిస్టరీని సైంటిస్టులు ఎట్టకేలకు ఛేదించారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించామంటున్నారు. అదో రహాస్యపు ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ తోకచుక్కగా మొదటినుంచి నమ్ముతున్నారు. అదో రహాస్యపు ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ తోకచుక్కగా మొదటినుంచి నమ్ముతున్నారు. ఆ తోకచుక్కకు ‘Oumuamua’ అని పేరు పెట్టారు. హువాయిన్‌లో Oumuamua అంటే.. స్కౌట్ లేదా మెసేంజర్ అని అర్థమట.
వాస్తవానికి ఈ రహాస్యపు ఏలియన్ తోకచుక్క 2017లో కనిపించింది. గంటకు 196 వేల మైళ్ల వేగంతో దూసుకెళ్లింది. చూడటానికి వింతగానూ అచ్చం తోకచుక్క మాదిరిగానే ఉంది. చదునైన ఉపరితలంతో ఉన్న ఈ తోకచుక్క కదిలినప్పుడు సాలిడ్ నైట్రోజన్‌తో నిండినట్టు కనిపిస్తోంది. ప్లూటో ఉపరితలం మాదిరిగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి కొత్త అధ్యయనాన్ని జనరల్ ఆఫ్ జియోఫిజికల్ రీసెర్చ్ ప్లానెట్స్ లో ప్రచురించారు. ఈ రీసెర్చ్ ద్వారా ఏలియన్ తోకచుక్క వెనుక దాగిన రహాస్యాన్ని కనిపెట్టేశామని సైంటిస్టులు అంటున్నారు.
ప్రపంచంలో సగమంతా పరిమాణంలో ఉన్న Oumuamua అనే తోకచుక్క.. బిలియన్ ఏళ్ల క్రితమే ప్లూటో ఉపరితలాన్ని తాకిందని సైంటిస్టులు విశ్వసిస్తున్నారు. తోకచుక్క భాగంలో 95శాతానికి పైగా తగ్గి చదనుగా మారిందని అధ్యయన రచయిత అలన్ జాక్సన్ తెలిపారు. గడ్డుకట్టిన నైట్రోజన్ తో రూపొందిన ఈ తోకచుక్క అసాధారణ ఆకారంలో ఉందని చెప్పారు. ఇది ఇతర సాధారణ తోకచుక్క మాదిరిగా లేదని అంటున్నారు.
ఊహించినదానికంటే తక్కువ ద్రవ్యరాశితో సౌర వ్యవస్థలోకి ప్రవేశించిందని తెలిపారు. ఈ మిస్టరీయస్ తోకచుక్కను చూసిన మొదటిసారి ఇదొక ఏలియన్ టెక్నాలజీకి చెందిన భాగమనే ఊహాగానాలు వినిపించాయి. మనకు తెలిసిన సౌర వ్యవస్థలు మాదిరిగానే అంతరిక్షంలో మరెన్నో కొత్త సౌర వ్యవస్థలున్నాయని, వాటి చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.