Aadhaar-BHIM : గుడ్ న్యూస్.. ఇకపై మీ ఆధార్ నెంబర్‌తో డబ్బులు పంపుకోవచ్చు!

ఆధార్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ ఆధార్ నెంబర్‌తో డబ్బులు పంపుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఉపయోగించి BHIM UPI యాప్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

Aadhaar-BHIM : ఆధార్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ ఆధార్ నెంబర్‌తో డబ్బులు పంపుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఉపయోగించి BHIM UPI యాప్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. కరోనా పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా పెరిగిపోయాయి. ప్రతిఒక్కరూ ఆన్ లైన్ పేమెంట్లపైనే ఆధారపడుతున్నారు. ఇతర డిజిటల్ పేమెంట్ల మాదిరిగానే యూపీఐ పేమెంట్స్ కోసం ఆధార్ నెంబర్ కూడా వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ ఉంటే పర్వాలేదు.. అలాగే యూనిఫైడ్ ఇంటర్ ఫేస్ (UPI) అడ్రస్ లేని వినియోగదారులు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవడం ఇబ్బందిగా మారింది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు BHIM (Bharat Interface For Money) వినియోగించే యూజర్ల సాయంతో ఆధార్ నెంబర్ ద్వారా డబ్బులు పంపుకునే వెసులుబాటు కల్పించింది (UIDAI) యూఐటీఏఐ. అంటే.. స్మార్ట్ ఫోన్, యూపీఐ ఐడీ లేనివారికి ఈ రెండు ఉన్న వినియోగదారులు ఆధార్ నెంబర్ ఉపయోగించి వారికి డబ్బులు పంపవచ్చు. BHIM అంటే.. యూపీఐ (Unified Payment Interface-UPI) ఆధారిత యాప్‌. మొబైల్ నంబర్, పేరుతో డబ్బులు పంపుకోవచ్చు. UIDAI ప్రకారం.. భీమ్‌ యాప్‌లో లబ్ధి దారుల అడ్రస్‌ విభాగంలో ఆధార్‌ నెంబర్‌ను ఉపయోగించి కూడా డబ్బులు పంపుకోవచ్చు. సాధారణంగా మొబైల్ నెంబర్ ద్వారా లింకైన బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు పంపుకోవచ్చు. అయితే ఇప్పుడు భీమ్‌లోని లబ్ధిదారుల అడ్రస్‌లో ఆధార్ నంబర్‌ ద్వారా కూడా డబ్బులు పంపే ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది.

భీమ్‌లో ఆధార్‌తో మనీ ట్రాన్స్ ఫర్ ఇలా :
– భీమ్‌లో ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయాలి. లబ్ధిదారుని 12 అంకెల ప్రత్యేక ఆధార్ నంబర్‌ ద్వారా వెరిఫై బటన్‌ను క్లిక్‌ చేయండి.
– సిస్టమ్ ఆధార్ లింకింగ్, లబ్ధిదారుల అడ్రస్ వెరిఫై చేస్తుంది.
– UIDAI సమాచారం ప్రకారం.. యూజర్ల నగదును లబ్ధిదారుడి అకౌంట్‌లో పంపుకోవచ్చు.
– పేమెంట్స్ స్వీకరించేందుకు ఆధార్ పే (Aadhaar) PoSని ఉపయోగించే వ్యాపారులకు డిజిటల్ పేమెంట్స్ చేసుకోవచ్చు.
– ఇక్కడ ఆధార్ నంబర్, ఫింగర్ ఫ్రింట్ ఉపయోగించాలి.
– ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటే.. ఆయా అకౌంట్‌లకు ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి.
– అప్పుడు మాత్రమే అన్ని అకౌంట్‌లకు మనీ సెండ్‌ చేయడం వీలవుతుంది.

Read Also :  First Covid Case : ప్రపంచంలో మొట్టమొదట కోవిడ్ సోకింది ఆమెకేనట!

ట్రెండింగ్ వార్తలు