Tech Tips in Telugu : వాట్సాప్‌లో అదిరే ట్రిక్.. కాంటాక్టు సేవ్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు తెలుసా? ఇదిగో 5 సింపుల్ టిప్స్..!

WhatsApp Messages : వాట్సాప్ యూజర్లు చాట్‌ చేసేందుకు సాధారణంగా కాంటాక్టులను సేవ్ చేయడం అవసరం. మీ కాంటాక్టుల లిస్టుకు నంబర్‌ను యాడ్ చేయకుండా మెసేజ్ ఎలా పంపాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Send WhatsApp messages without saving contacts

WhatsApp Messages : వాట్సాప్ యూజర్ల కోసం అదిరిపోయే ట్రిక్.. మీరు ఏదైనా వాట్సాప్ నెంబర్‌కు సేవ్ చేయకుండానే సులభంగా చాట్ చేయొచ్చు తెలుసా? మీ ఫోన్ కాంటాక్టుల్లో సదరు వ్యక్తి ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేసేందుకు అనుమతిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ యూజర్లు వాట్సాప్ వినియోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ యూజర్లకు కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నప్పటికీ, చాట్‌ చేసేందుకు సాధారణంగా కాంటాక్టులను సేవ్ చేయడం అవసరం. అయితే, మీ కాంటాక్టుల లిస్టుకు నంబర్‌ను యాడ్ చేయకుండా మెసేజ్ ఎలా పంపాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Best Mobile Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

ఫోన్ నంబర్‌ను సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపే 5 సాధారణ పద్ధతులివే :

  • వాట్సాప్ అప్లికేషన్‌ని ఉపయోగించాలి.
  • వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ చేయాలనుకునే మొబైల్ నంబర్‌ను కాపీ చేయండి.
  • “New Chat” బటన్‌ను ట్యాప్ చేయండి.
  • “WhatsApp Contacts” కింద మీ పేరును ఎంచుకోండి.
  • మొబైల్ నంబర్‌ను టెక్స్ట్ బాక్స్‌లో ఎంటర్ చేసి “Send” ఆప్షన్ క్లిక్ చేయండి.
  • మొబైల్ నంబర్‌ను ట్యాప్ చేయండి.
  • ఆ వ్యక్తి నెంబర్ వాట్సాప్‌లో ఉంటే.. మీకు “Chat with” ఆప్షన్ కనిపిస్తుంది.
  • వెంటనే “Chat with” ఆప్షన్ ట్యాప్ చేసి చాట్ చేయండి.

మీ బ్రౌజర్‌లో వాట్సాప్ చాట్ లింక్‌ను ఎలా క్రియేట్ చేయాలంటే? :

  • మీ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి (మొబైల్ లేదా డెస్క్‌టాప్‌లో).
  • అడ్రస్ బార్‌లో కింది లింక్‌ https://api.whatsapp.com/send?phone=xxxxxxxxxx ఎంటర్ చేయాలి.
  • కంట్రీ కోడ్‌తో సహా “xxxxxxxxx”ని మొబైల్ నంబర్‌తో రిప్లేస్ చేయండి (ఉదా, http://wa.me/919876543210).
  • వాట్సాప్ చాట్ విండోను ఓపెన్ చేసి ఎంటర్ (Enter) ట్యాప్ చేయండి.
  • “Continue to Chat” నొక్కండి.

ట్రూకాలర్  (Truecaller) యాప్‌ని ఉపయోగించాలి :

  • ట్రూకాలర్ యాప్‌ని ఓపెన్ చేసి మొబైల్ నంబర్ కోసం సెర్చ్ చేయండి.
  • ఈ కిందికి స్క్రోల్ చేసి నంబర్ పక్కన ఉన్న వాట్సాప్ ఐకాన్ ట్యాప్ చేయండి.
  • ఆ నంబర్ కోసం వాట్సాప్ చాట్ విండోను ఓపెన్ చేయాలి.

గూగుల్ అసిస్టెంట్ (Android) ఉపయోగించండి :

  • గూగుల్ అసిస్టెంట్‌ని యాక్టివేట్ చేసి, “[కంట్రీ కోడ్ మొబైల్ నంబర్]కి వాట్సాప్ పంపండి”
  • (ఉదాహరణ : “+919876543210కి వాట్సాప్ పంపండి”).
  • మీరు పంపాలనుకుంటున్న మెసేజ్ పంపండి.
  • గూగుల్ అసిస్టెంట్ ద్వారా నిర్దేశిత నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది.

సిరి షార్ట్‌కట్స్ ద్వారా ట్రై చేయండి (ఐఫోన్) :

  • సిరి షార్ట్‌కట్‌ యాప్‌ ఓపెన్ చేయండి.
  • “Settings” > “Shortcuts”కి వెళ్లి “Allow Untrusted Shortcuts”ని ఎనేబుల్ చేయండి.
  • “వాట్సాప్ Non-Contact” షార్ట్‌కట్ డౌన్‌లోడ్ చేయండి
  • (ఆన్‌లైన్‌లో సెర్చ్ లేదా http://wa.me/919876543210 లింక్‌ ఉపయోగించండి).
    కొత్త వాట్సాప్ చాట్ విండోను ఓపెన్ చేసేందుకు షార్ట్‌కట్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

Read Also : Whatsapp Tech Tips : వాట్సాప్‌లో మీ ఫ్రెండ్ డిలీట్ చేసిన మెసేజ్‌లను ఎలా చదవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్..!