SIM Blocked
SIM Blocked : ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరి ఫోన్‌లో ఒకటికి మించి సిమ్ కార్డులు వాడేస్తున్నారు. డ్యూయల్ సిమ్ ఫోన్లు కావడంతో రెండు వేర్వేరు నెట్‌వర్క్‌లు(SIM Blocked) లేదా ఒకే నెట్‌వర్క్ కలిగిన సిమ్ కార్డులను వాడుతున్నారు. మీరు కూడా ఒకే మొబైల్‌లో రెండుకు మించి సిమ్ కార్డులు వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..
ఇంతకీ మీకెన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోండి. భారత టెలికాం శాఖ (DoT) దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల సిమ్ కార్డులను (mobile numbers Block) బ్లాక్ చేసింది. ఇందులో ఎక్కువ భాగం ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా లేదా నిబంధనలను ఉల్లంఘించి జారీ చేసిన సిమ్ కార్డులే ఉన్నాయి. సంచార్ సాథీ పోర్టల్, AI- ఆధారిత డిజిటల్ యానాలిసిస్ ఆధారంగా ఈ చర్య తీసుకుంది.
మీ ఫోన్ నంబర్లు, సిమ్ కార్డుల అథెంటిసిటీ ప్రొటెక్ట్ చేసేందుకు DoT చర్యలు చేపట్టింది. సాధారణంగా, ఒక వ్యక్తికి 9 సిమ్‌ల పరిమితి కన్నా ఎక్కువ సిమ్‌లు ఉన్న లేదా రిజిస్ట్రేషన్‌లో లోపాలు ఉన్నట్లు తేలిన ఆయా సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయి.
ఈ క్యాంపెయిన్ లక్ష్యం సైబర్ నేరాలను నివారించడంతో పాటు మోసపూరిత కాల్స్, SMS లేదా ఆర్థిక మోసాలను నిరోధించడమే. అలాగే, సిమ్ బ్లాకింగ్ అనేది వెంటనే అయిపోతుంది. సంచార్ సాథీ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల ద్వారా చాలా మంది యూజర్ల మొబైల్ నెంబర్లు బ్లాక్ అయ్యాయి. మీ మొబైల్ సిమ్ కూడా బ్లాక్ అయిందో లేదో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు.
DoT సిమ్ బ్లాక్ చేయడానికి కారణాలివే :
DoT ప్రకారం.. ఒక వ్యక్తి పేరు మీద 9 సిమ్ కార్డులు మాత్రమే ఉండాలి. బీహార్, జార్ఖండ్‌లోని అనేక ప్రాంతాలలో కొంతమంది ఈ పరిమితిని ఉల్లంఘించారు. ఫేక్ డాక్యుమెంట్ల సాయంతో ఇలాంటి అనేక కనెక్షన్‌లు జారీ అయ్యాయి. అందుకే ఆ శాఖ ఈ సిమ్ కార్డులను డియాక్టివేట్ చేసింది.
వినియోగదారులు ఏం చేయాలి? :