Smartphones under Rs.10k can make for excellent Valentines Day gifts
Valentines Day Gifts : వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రియమైనవారి కోసం రూ. 10వేల లోపు స్మార్ట్ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ బహుమతిగా అందించవచ్చు. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లు అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కాల్‌లు, మెసేజ్‌లు, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈజీగా కనెక్ట్ కావొచ్చు.
ఈ ధర రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌లు ఆకర్షణీయమైన ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఫోటోలు, వీడియోలు, యాప్‌ల కోసం భారీ స్టోరేజ్‌ని అందిస్తాయి. డిస్‌ప్లేలు కూడా మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గాడ్జెట్‌లు కేవలం ఫంక్షనల్‌గా ఉండటమే కాకుండా స్టైలిష్ యాక్సెసరీలుగా కూడా పనిచేస్తాయి. వాలెంటైన్స్ డే బహుమతిగా రూ. 10వేల లోపు స్మార్ట్ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకోవచ్చు. ఇదిగో ఫుల్ లిస్ట్ మీకోసం..
1. రెడ్‌మి 13సి 5జీ :
రెడ్‌మి 13సి 5జీ ఫోన్ స్టార్ట్రైల్ గ్రీన్ వేరియంట్‌లో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ఎస్ఓసీ 4జీబీ ర్యామ్ (ప్లస్ 4జీబీ వర్చువల్)తో మల్టీ టాస్కింగ్ అందిస్తుంది. 6.74-అంగుళాల హెచ్‌డీ+ 90హెచ్‌జెడ్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. అయితే, 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. 5000ఎంఎహెచ్ బ్యాటరీతో లాంగ్ లైఫ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఎక్కువ కాలం మన్నికను కోరుకునే వినియోగదారులు ఈ ఫోన్ కొనేసుకోవచ్చు.
రెడ్‌మి 13సి 5జీ స్పెసిఫికేషన్లు :
ర్యామ్/స్టోరేజ్ : 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
డిస్‌ప్లే : 6.74-అంగుళాల హెచ్‌డీ+ 90హెచ్‌జెడ్
కెమెరా : 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా
బ్యాటరీ : 5000ఎంఎహెచ్
2. రియల్‌మి నార్జో ఎన్53 :
రియల్‌మి నార్జో ఎన్53 ఫెదర్ బ్లాక్ డిజైన్‌తో వస్తుంది. సున్నితమైన పర్ఫార్మెన్స్ కోసం 8జీబీ +128జీబీ కాన్ఫిగరేషన్‌ను అందిస్తుంది. 33డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్, స్లిమ్ డిజైన్ అందిస్తుంది. 7.49ఎమ్ఎమ్ బాడీతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. 50ఎంపీ ఏఐ కెమెరా ఫొటోగ్రఫీ, 5000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఈ డివైజ్ స్పీడ్, స్టైల్, స్టామినాతో స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఆప్షన్.
రియల్‌మి నార్జో ఎన్53 స్పెసిఫికేషన్‌లు :
ర్యామ్/స్టోరేజ్ : 8జీబీ+128జీబీ
ఛార్జింగ్ : 33డబ్ల్యూ సూపర్‌వోక్
డిజైన్ : సెగ్మెంట్‌లో సన్నని ఫోన్
కెమెరా : 50ఎంపీ ఏఐ కెమెరా
3. రెడ్‌మి ఎ2 ఫోన్ :
రెడ్‌మి ఎ2 ఫోన్ సరసమైన ధరలో మీడియాటెక్ హెలియో జీ36 ప్రాసెసర్‌తో వస్తుంది. గరిష్టంగా 4జీబీ ర్యామ్ (2జీబీ వర్చువల్ ర్యామ్‌తో సహా) కలిగి ఉంటుంది. 6.5 సెంమీ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో పవర్‌ఫుల్ విజువల్స్ అందిస్తుంది. అయితే, 8ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీతో వినియోగదారులకు లాంగ్ లైఫ్ బ్యాటరీని అందిస్తుంది. బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే యూజర్లకు అనుకూలంగా ఉంటుంది.
రెడ్‌మి ఎ2 స్పెసిఫికేషన్స్ :
ర్యామ్/స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
డిస్‌ప్లే : 16.5సెం.మీ హెచ్‌డీ ప్లస్
కెమెరా : 8ఎంపీ డ్యూయల్ కెమెరా
బ్యాటరీ : 5000ఎంఎహెచ్
Smartphones Valentines Day
4. రెడ్‌మి 12సి ఫోన్ :
రెడ్‌మి 12సీ ఫోన్ మింట్ గ్రీన్‌లో వస్తుంది. మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ (ప్లస్ 5జీబీ వర్చువల్ ర్యామ్) సెటప్‌ను కలిగి ఉంది. 17సెం.మీ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే స్క్రాచ్-రెసిస్టెంట్ గ్లాస్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది. 50ఎంపీ ఏఐ డ్యుయల్ కెమెరా సిస్టమ్ క్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్‌కు ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులకు ఆకర్షణీయమైనది.
రెడ్‌మి 12సి స్పెసిఫికేషన్స్ :
ర్యామ్/స్టోరేజ్ : 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
డిస్‌ప్లే : 17సెం.మీ హెచ్‌డీ ప్లస్
కెమెరా : 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా
బ్యాటరీ : 5000ఎంఎహెచ్
5. శాంసంగ్ గెలాక్సీ ఎం13 :
శాంసంగ్ గెలాక్సీ ఎం13 ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. పవర్‌హౌస్ మిడ్‌నైట్ బ్లూలో 4జీబీ ర్యామ్ నుంచి 8జీబీ వరకు విస్తరించవచ్చు. భారీ 6000ఎంఎహెచ్ బ్యాటరీతో లాంగ్ లైఫ్ అందిస్తుంది. ఈ మోడల్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో విస్తృతమైన బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులకు బెస్ట్ అప్షన్ అని చెప్పవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్పెసిఫికేషన్‌లు :
ర్యామ్/స్టోరేజ్ : 4జీబీ, 64జీబీ స్టోరేజ్
బ్యాటరీ : 6000ఎంఎహెచ్
ర్యామ్ : ర్యామ్ ప్లస్‌తో 8జీబీ వరకు
డిజైన్ : మిడ్‌నైట్ బ్లూ