Snapchat’s Usage Rises 23% Amid Facebook Outage
Facebook outage : ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ (Facebook) సర్వీసులు నిలిచిపోవడం ఆ సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. ఫేస్‌బుక్, మెసేంజర్ యాప్ వాట్సాప్, ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫాం సర్వీసులు దాదాపు 7 గంటల పాటు నిలిచిపోయాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆయా యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేస్ బుక్ DNS సర్వర్లు నిలిచిపోవడంతోనే సర్వీసులు స్తంభించిపోయినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికా ఆధారిత ఫొటో షేరింగ్ యాప్ SnapChat కు బాగా కలిసొచ్చింది. ఎప్పుడూ అరకొర యూజర్లతోనే నడిచే యాప్ కు ఒక్కసారిగా యూజర్ల ఫ్లో పెరిగిపోయింది.
Amazon GIF : అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్.. తెలంగాణలో 31వేల మంది వ్యాపారులకు బెనిఫిట్
ఫేస్ బుక్ సంబంధిత యాప్స్ వాట్సాప్ (WhatsApp), ఇన్ స్ట్రాగ్రామ్ (Intagram) ఓపెన్ కాకపోవడంతో యూజర్లంతా స్నాప్ చాట్ బాట పట్టారు. ఇన్ స్టాగ్రామ్ పోటీదారు యాప్ అయిన ఈ స్నాప్ చాట్ కు సోమవారం ఒక్కరోజే 23శాతం మంది యూజర్లు పెరిగారు. 6 గంటల పాటు సర్వీసులకు అంతరాయం కలగడంతో ఇదే సమయంలో స్నాప్ చాట్ యూజర్లను తనవైపు తిప్పుకుంది. ఫేస్ బుక్ అంతరాయం కారణంగా 2.7 బిలియన్ల మంది యూజర్లు అసౌకర్యానికి గురయ్యారు. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని యాప్స్‌కు అంతరాయం కలగడంతో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ యాప్స్ అయిన సిగ్నల్, టెలిగ్రామ్, టిక్ టాక్, ట్విట్టర్ అకౌంట్లను యూజర్లు ఎక్కువగా వినియోగించుకున్నారు.
దీంతో ఇతర యాప్స్ వినియోగం భారీగా పెరిగిందని నివేదిక వెల్లడించింది. టెలిగ్రామ్ (Telegram) యూజర్ వినియోగం 18 శాతం నమోదు కాగా, సిగ్నల్ (Signal) యాప్ వినియోగం 15 శాతం పెరిగినట్లు సంస్థలు వెల్లడించాయి. అక్టోబర్ 4న ఫేస్‌బుక్‌లో సాంకేతిక లోపం తలెత్తిన సమయంలో 70 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ వినియోగించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ సర్వీసులు అన్ని గంటల సేపు నిలిచిపోవడానికి కమ్యూనికేషన్ టూల్స్‌లో లోపాలే కారణమని పేర్కొంది. కాన్ఫిగరేషన్ (configuration) మార్పుల్లో తలెత్తిన లోపాల వల్ల సర్వీసులకి అంతరాయం ఏర్పడిందని సంస్థ ఇంజినీర్ల బృందం పేర్కొంది.
Elon Musk Rival Jeff Bezos : అమెజాన్ బాస్‌ను ఏకిపారేసిన మస్క్.. దావాలతో మా అంతరిక్ష యానం ఆగదు!