Google Assistant : ఇకపై గూగుల్‌ అసిస్టెంట్‌తో కొవిడ్ టీకా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు!

కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోలేదా? అయితే ఇకపై ఈజీగా కొవిడ్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. Google Assistant ద్వారా టీకా బుకింగ్ చేసుకోవచ్చు.

Soon, Book Covid 19 Vaccination Slots Using Google Assistant

Google Assistant : కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోలేదా? అయితే ఇకపై ఈజీగా కొవిడ్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. Google Assistant ద్వారా సింపుల్‌గా టీకా బుకింగ్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొవిడ్ టీకా స్లాట్‌లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వచ్చే ఏడాది 2022 ప్రారంభంలో అమెరికా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ అసిస్టెంట్ (Google Assistant) ఫీచర్ ద్వారా టీకా స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చునని గూగుల్ ఇండియా ప్రకటించింది.

భారత్‌లో మొట్టమొదటిసారిగా గూగుల్ అసిస్టెంట్ ప్రారంభించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్.. ఎండ్-టు-ఎండ్ వ్యాక్సిన్ బుకింగ్ ఫ్లో పైలట్‌ను ప్రకటించారు. 2022 ప్రారంభంలో రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. గూగుల్ ఇండియా 2021 ఈవెంట్ తర్వాత గూగుల్ ఇండియా ఈ ట్వీట్ చేసింది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా టీకా స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…

1. సెర్చ్ బాక్స్‌లో.. ‘కోవిడ్-19 వ్యాక్సిన్’ అని టైప్ చేయండి. ‘కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్’ ఏదైనా ప్రశ్నను టైప్ చేయండి.
2. Google అసిస్టెంట్‌ ఓపెన్ చేయండి. మీ భాషను ఎంచుకోండి. ఇంగ్లీష్ లేదా 8 భారతీయ భాషల్లో ఏదైనా భాషను ఎంచుకోవచ్చు.
3. పేరు నమోదు చేసుకోవాలంటే.. 12-అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి.
4. పూర్తి పేరు, పుట్టిన సంవత్సరం (YYYY ఫార్మాట్) వంటి వివరాలను నమోదు చేయండి.
5. టీకా స్లాట్‌ను బుక్ చేయాల్సిన లబ్ధిదారుని ఎంచుకోండి.
6. పిన్ కోడ్ లేదా జిల్లా పేరుతో టీకా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో సెర్చ్ చేయండి.
7. ఉచిత లేదా చెల్లింపు (Paid) వ్యాక్సిన్ స్లాట్ ఎంచుకోండి.
8. టీకాలు వేసేందుకు ఏ వ్యాక్సిన్ కావాలో ఎంచుకోండి.
9. మీకు వీలైన సమయం ప్రకారం.. తేదీ, సమయ స్లాట్‌ను ఎంచుకోండి.
10. అపాయింట్‌మెంట్ షెడ్యూల్ అవుతుంది. ఆ రోజున వెళ్లి టీకా వేయించుకోవచ్చు.

Read Also : Manasa Varanasi : మిస్ వరల్డ్ 2021 పోటీలకు హైదరాబాద్‌ అమ్మాయి మానస వారణాసి