Manasa Varanasi : మిస్ వరల్డ్ 2021 పోటీలకు హైదరాబాద్ అమ్మాయి మానస వారణాసి
మిస్ వరల్డ్ 2021 పోటీలల్లో హైదరాబాద్ అమ్మాయి మానస వారణాసి పాల్గొననుంది. దీనికోసం మానస అన్నిరకాలుగా సిద్ధమవుతోంది.

Manasa Varanasi Is To Represent India At Miss World 2021
Manasa Varanasi is to represent India at Miss World 2021 : హైదరాబాద్‌కు అమ్మాయి మానస వారణాసి మిస్ వరల్డ్ 2021 పోటీలకు సిద్ధమవుతోంది. తెలంగాణకు చెందిన మానస వారణాసి ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల కిరీటాన్ని అందుకుంది. ప్యూర్టో రికోలోని శాన్ జువాన్, కోకాకోలా మ్యూజిక్ హాల్‌లో 2021, డిసెంబర్ 16న జరగబోయే మిస్ వరల్డ్ 2021 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది.2020లో కరోనా వల్ల మిస్ వరల్ట్ పోటీలు వాయిదా పడి వచ్చే డిసెంబర్ లో జరుగనున్నాయి. ఈ పోటీలకు హైదరాబాద్ కు చెందిన మానసా వారణాసి పాల్గొననున్నారు. ఈ ఈవెంట్ లో దాదాపు 100మంది సుందరాంగులు పాల్గొనే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
Read more : Beauty Pageant for Sheep: అందాల పోటీల్లో గొర్రెల క్యాట్ వాక్.. మీరెప్పుడైనా చూశారా?
24ఏళ్ల మానస వారణాసి 1997 మార్చి 27న హైదరాబాదులో జన్మించింది. తండ్రి ఉద్యోగం కారణంగా మలేషియాకు వెళ్ళిన మానస 2011-12 బ్యాచ్‌లో జిఐఐఎస్ మలేషియా క్యాంపస్ నుండి గ్రేడ్ 10 పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాదుకి వచ్చి ఎఫ్ఐఐటి జెఈఈలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చదువును పూర్తిచేసి, ఫాక్ట్ సెట్ లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ విశ్లేషకురాలిగా పనిచేసింది.
Read more : World Record: Lip Balmతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఆరేళ్ళ చిన్నారి..
2019లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీలో పాల్గొన్న మానస టాప్ 3 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. 2020లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ విజేతగా నిలిచింది. 2020లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. 2021, ఫిబ్రవరి 10న ముంబైలోని హయత్ రీజెన్సీలో అవుట్ గోయింగ్ టైటిల్ హోల్డర్ సుమన్ రావు చేత ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020గా కిరీటం అందుకుంది. పోటీకి సంబంధించిన ముందస్తు పోటీ కార్యక్రమంలో ఆమె ‘మిస్ రాంప్‌వాక్’ అవార్డును గెలుచుకుంది.ఈక్రమంలో మిస్ వరల్డ్ కిరీటంపై కన్నేసిన మానసా వారణాసి ఈ పోటీల్లో పాల్గొన విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది.