×
Ad

Gmail Address : బిగ్ అప్‌డేట్.. ఇకపై మీ జీమెయిల్ అకౌంట్ అడ్రస్ మార్చుకోవచ్చు.. గూగుల్ కొత్త ఫీచర్ ఏంటి? ఫుల్ డిటెయిల్స్

Gmail Address : జీమెయిల్ అకౌంట్ పేరు మార్చుకోవచ్చు. గూగుల్ ఇమెయిన్ అడ్రస్ ఎలా మార్చుకోవచ్చు? అసలు ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Gmail Address

Gmail Address : జీమెయిల్ యూజర్లకు అద్భుతమైన న్యూస్.. ఇకపై మీ జీమెయిల్ అకౌంట్ అడ్రస్ ఈజీగా మార్చుకోవచ్చు. సాధారణంగా జీమెయిల్ అకౌంట్ ఒకసారి క్రియేట్ అయితే అందులోని పేరు మళ్లీ మార్చుకునేందుకు అవకాశం ఉండదు. కానీ, ఇప్పుడు ఇమెయిల్ యూజర్ నేమ్ సింపుల్‌గా మార్చుకోవచ్చు. అంతేకాదు.. @gmail.comతో ముగిసే అన్ని ఇమెయిల్ అడ్రస్‌లు అందుబాటులోకి వస్తాయి.

గతంలో జీమెయిల్‌లో ఈ ఫీచర్ ఇమెయిల్ అడ్రస్ ఉండి కంపెనీ ఉద్యోగి ఇమెయిల్ అడ్రస్ వంటి మరొక సర్వీసు ప్రొవైడర్ తో లింక్ అయిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. @gmail.comతో ముగిసే ఇమెయిల్ అడ్రస్‌లను మార్చడం సాధ్యం పడేది కాదు.. కానీ, ఇకపై ఈ సమస్య ఉండదు.

గూగుల్ సపోర్టు పేజీలో మీ గూగుల్ అకౌంట్ ఇమెయిల్ అడ్రస్ మార్చే ప్రాసెస్ క్రమంగా అందరి యూజర్లకు అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఆప్షన్ మీకు ప్రస్తుతం అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ ఫీచర్ అతి త్వరలో అందరికి అందుబాటులోకి రావచ్చు.

Read Also : PAN Aadhaar Link : బిగ్ అలర్ట్.. మీ పాన్-ఆధార్ లింక్ చేయలేదా? ఇదే లాస్ట్ ఛాన్స్.. భారీ మూల్యం తప్పదు.. లింకింగ్ ప్రాసెస్ ఇదిగో..!

పాత ఇమెయిల్ వర్కింగ్.. అన్ని మెయిల్స్ కొత్త జీమెయిల్‌కు..
జీమెయిల్ సపోర్టు పేజీలో జీమెయిల్ అడ్రస్ మార్చుకున్న వినియోగదారులు కొత్త, పాత ఇమెయిల్ అడ్రస్‌లలో ఇమెయిల్‌లను స్వీకరిస్తారు. పాత ఇమెయిల్ అడ్రస్‌లో సేవ్ చేసిన డేటాపై ఎలాంటి ప్రభావం ఉండదు. వినియోగదారులు ఎప్పుడైనా తమ పాత జీమెయిల్ అకౌంట్ తిరిగి వాడుకోవచ్చు. అయితే, దీనిపై 12 నెలల పరిమితి ఉంటుంది. పాత ఇమెయిల్ అకౌంట్ నేమ్ మార్చితే 12 నెలల వరకు డిలీట్ చేయలేం.

జీమెయిల్ ఐడీ నేమ్ మార్చడం ద్వారా కొత్త ఐడీతో Maps, YouTube, Google Play లేదా Drive వంటి గూగుల్ సర్వీసులకు సైన్ ఇన్ చేయగలరని గూగుల్ పేర్కొంది. జీమెయిల్ ఐడీ పేరు మాత్రమే మారుతుందని గమనించాలి. అంటే.. డొమైన్ @gmail.comగానే ఉంటుంది.

జీమెయిల్ ఐడీలో మార్పు కోసం కొత్త ఐడీని క్రియేట్ చేయొచ్చు. మీ ఇమెయిల్ ఐడీ మీ చిన్ననాటి పేరు లేదా షార్ట్‌కట్‌తో క్రియేట్ చేసి ఉంటే అది మార్చుకోవచ్చు. అతి త్వరలోనే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. కానీ, మీ జీమెయిల్ చివరి @gmail.com అడ్రస్ మార్చలేమని గమనించాలి.

జీమెయిల్ మార్పుతో ఏంటి? :
మీ జీమెయిల్ అడ్రస్ మార్చిన తర్వాత మీ పాత ఇమెయిల్ అడ్రస్ మారుపేరుగా ఉంటుంది. మారుపేరు అంటే.. మీ పాత ఇమెయిల్ అడ్రస్ పనిచేస్తూనే ఉంటుంది. ఆ అడ్రస్‌కు పంపిన అన్ని ఇమెయిల్‌లు మీ కొత్త ఇన్‌బాక్స్‌కు వస్తాయి. ఒక యూజర్ ఒకే జీమెయిల్ అకౌంట్‌కు సంబంధించి 4 వేర్వేరు ఇమెయిల్ అడ్రస్ కలిగి ఉండొచ్చు.