Soon, You Can Use Your Debit Cards For Offline Payments Without Network
debit cards for offline payments : డెబిట్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎలాంటి నెట్ వర్క్ అవసరం లేకుండానే ఈజీగా డెబిల్ కార్డు చెల్లింపులు చేసుకోవచ్చు. అంటే.. ఆఫ్ లైన్ లోనూ డెబిట్ కార్డులను వాడుకోవచ్చు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (PoC) మిషన్లలో ఇంటర్నెట్ ఉంటేనే డెబిట్ కార్డులను స్వైప్ చేయడానికి వీలుంది. అయితే ఇకపై ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆఫ్ లైన్ లోనూ డెబిట్ కార్డులను చక్కగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.
ఈ టెక్నాలజీ సాయంతో ఉన్నచోటే డెబిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. వీసా (Visa) సంస్థ.. పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఇన్నోవిటి (Innoviti) భాగస్వామ్యంతో Visa డెబిట్ కార్డులను ఆఫ్ లైన్ పేమెంట్స్ కోసం ఈ టెక్నాలజీ తీసుకొస్తోంది. అది కూడా PoC పద్ధతిలో ప్రవేశపెట్టనుంది. సాధారణంగా వీసా అందించే చిప్ ఆధారిత డెబిట్ కార్డు ద్వారా ఇంటర్నెట్ లేకున్నా ప్రతి రోజు రూ.2వేల వరకు లావాదేవీలు చేసుకోనే వీలుంది.
WhatsApp Moderators : వాట్సాప్ మోడరేటర్లు మీ మెసేజ్‌లు చూస్తున్నారని తెలుసా?
ప్రతి ట్రాన్సాక్షన్ పరిమితి రూ.200 మాత్రమేనని ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త PoC కార్డును Yes Bank, Axis Bank బ్యాంకుల భాగస్వామ్యంతో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రీపెయిడ్ కార్డులు ఇతర కార్డుల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ వీసా ఆఫ్ లైన్ కార్డులు నెట్ వర్క్ క్లౌడ్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ కొత్త వీసా చిప్ డెబిట్ కార్డులో రోజువారీ ఖర్చు పరిమితి రూ.2,000 వరకు ఉంటుంది. ప్రతి లావాదేవీ పరిమితి కూడా రూ.200 మాత్రమే. తగిన బ్యాలెన్స్ లేకుంటే ట్రాన్సాక్షన్ డిక్లైన్ అవుతుంది.
ఈ డెబిట్ కార్డుతో బ్యాంకు అకౌంట్ దారులకు, వ్యాపారుల మధ్య సానుకూలంగా ఉంటుంది. ఇంటర్నెట్ లేకున్నా కూడా లావాదేవీలను జరుపుకునేందుకు వీలుంటుంది. పేమెంట్స్ ఫెయిలర్ వంటి సమస్యలను ఎదుర్కోనే పరిస్థితి ఉండదు. వీసా ఈ కొత్త టెక్నాలజీని మొట్టమొదటిసారిగా భారత మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గతంలోనే ఆర్బీఐ బ్యాంకులకు పలు సూచనలు చేసింది. అందులో భాగంగానే ఈ కొత్త టెక్నాలజీ వీసా ప్రవేశపెడుతోంది.
IPL Ad Revenue : ఐపీఎల్‌లో 10 సెకన్ల యాడ్‌కు టీవీలు ఎంత వసూల్ చేస్తాయంటే?