ISRO : అంతరిక్ష రంగంలో జోరు చూపించేందుకు భారత్ సిద్ధమవుతోంది. వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్ – స్పేస్) వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న 14 నెలల్లో అంటే.. 2023-24 నాల్గో త్రైమాసికంలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. వీటిల్లో ప్రతిష్టాత్మక గగన్ యాన్ ప్రాజెక్టుకు సంబంధించినవి ఏడు ప్రయోగాలు ఉన్నాయి. స్పైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేట్ అంతరిక్ష అంకుర సంస్థల ప్రయోగాలూ ఏడు ఉన్నట్లు ఇన్ స్పేస్ వెల్లడించింది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించేందుకు ప్రణాళికలు చేయబడ్డాయి. వీటిలో సగం భారతదేశంలోని వాణిజ్య అంతరిక్ష రంగానికి ఉపయోగపడనున్నాయి.
ISRO: 50 శాటిలైట్లను ప్రయోగిస్తాం: ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్
అంతరిక్ష రంగంలో ప్రస్తుతం భారతదేశం అగ్రదేశాల సరసన చేరింది. అతి తక్కువ బడ్జెట్ తో ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేపట్టడమే కాకుండా.. వాటిని విజయవంతంగా తీరాలకు చేర్చుతోంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా రోదసి రంగంలో భారత్ అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో 2024-25లో మరిన్ని ప్రయోగాలను నింగిలోకి పంపించేందుకు సిద్ధమైంది. ఇందులో ఇస్రో పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీలలో మూడు టెస్ట్ వెహికిల్స్ తోపాటు గగన్ యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఏడు ప్రయోగాలు ఉన్నాయి. ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, పీఎస్ఎల్వీకి చెందిన నాలుగు, ఒక ఎల్వీఎం-3 మిషన్, ఎస్ఎస్ఎల్వీకు చెందిన రెండు ప్రయోగాలను నిర్వహించాలని భావిస్తుంది. స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు అంతరిక్ష అంకుర సంస్థల ప్రయోగాలూ ఏడు ఉన్నట్లు పేర్కొంది. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ తన మొదటి 3-డీ ప్రింటెడ్ రాకెట్ అగ్నిబాన్ – సార్టెడ్ ను వచ్చే రెండు నెలల్లో ప్రయోగించనుంది.
Also Read : ISRO: ఇస్రో దూకుడు.. మరో సరికొత్త ప్రయోగానికి ప్రణాళికలు.. 2040 కల్లా టార్గెట్ పూర్తిచేసేలా చర్యలు
శ్రీహరికోట నుంచి ఇస్రో ఇన్సాట్ -3డీఎస్ ను ప్రయోగించేందుకు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 17న సాయంత్రం 5.30 గంటలకు ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14 (GSLV F14)లో ప్రయోగించబడుతుంది. ఈ ఉపగ్రహం సహాయంతో మెరుగైన వాతావరణ సూచన అందుబాటులోకి రావడంతో పాటు విపత్తు హెచ్చరికలకు కూడా ఉపకరిస్తుంది. ఇది పూర్తిగా ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు సమకూరుస్తుంది.
🚀GSLV-F14/🛰️INSAT-3DS Mission:
The mission is set for lift-off on February 17, 2024, at 17:30 Hrs. IST from SDSC-SHAR, Sriharikota.
In its 16th flight, the GSLV aims to deploy INSAT-3DS, a meteorological and disaster warning satellite.
The mission is fully funded by the… pic.twitter.com/s4I6Z8S2Vw— ISRO (@isro) February 8, 2024