స్పాటిఫై‌లో కొత్త టెక్నాలజీ : మీ వాయిస్ టోన్, ఎమోషన్ పసిగట్టి.. పాటలను వెతికి వినిపిస్తుంది!

Spotify based on users speech and emotion : మీరు మూడ్ ఎలా ఉంది? మీరు ఏం మాట్లాడుతున్నారు.. మీ వాయిస్ టోన్ వింటే చాలు.. మాటలను బట్టి మీ మూడ్ పసిగట్టేస్తుంది.. మీ మూడ్‌కు తగిన పాటలను వినిపిస్తుంది. మ్యూజిక్-స్ట్రీమింగ్ సంస్థ స్పాటిఫై టెక్నాలజీకి పేటెంట్ మంజూరు అయింది. ఈ కొత్త టెక్నాలజీ… మీ ఎమోషన్ బట్టి.. వాయిస్ టోన్ ఆధారంగా అదే పాటలను రికమండ్ చేస్తుంది. యూజర్ల మూడ్ ను గుర్తించి వారికి ఆహ్లాదకరంగా ఉండేందుకు వీలుగా స్పాటిఫై కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది.

దీనికి పేటెంట్స్ కూడా దక్కించుకుంది. స్పాటిఫై స్ట్రీమింగ్ కంపెనీ 2018 ఈ టెక్నాలజీ పేటెంట్స్ కోసం ఫిబ్రవరిలో ఫైల్ చేసింది. 2021లో ఈ టెక్నాలజీకి పేటెంట్స్ మంజూరు అయిందని మ్యూజిక్ కంపెనీ వెల్లడించింది. స్పాటిఫై యూజర్ ఎమోషన్ స్టేటస్, వయస్సు లేదా వారు వాయిస్ శబ్దాన్ని బట్టి సంబంధిత పాటల కంటెంట్ ను రికమండ్ చేస్తుంది.

పేటెంట్ ఫైలింగ్ ప్రకారం.. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే.. మాట్లాడే వ్యక్తి భావోద్వేగ స్థితిని గుర్తిస్తుంది. మాటల శబ్దం ఆధారంగా అతడు ఒత్తిడిలో ఉన్నాడా? ఆందోళనలో ఉన్నాడా? అనేది పసిగట్టేస్తుంది. మాట్లాడే విధానంలో తేడాలు, ఇష్టాలను బట్టి గుర్తించేలా టెక్నాలజీ కలిగి ఉంది.

యూజర్ గతంలో విన్న పాటల హిస్టరి ఆధారంగా మిగిలిన డేటాతో అవసరమైన మ్యూజిక్ సిఫార్సు చేస్తుంది. అదే ప్లే చేస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ స్పాటిఫైలోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో క్లారిటీ లేదు. అమెజాన్ కొత్త హాలో ఫిట్నెస్ ట్రాకర్ తీసుకోస్తోంది. వాయిస్ టోన్ ద్వారా ఈ ట్రాకర్ పనిచేస్తుంది. దీనిపై భావోద్వేగ గుర్తింపును దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఆందోళన కూడా నెలకొంది.